వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేంజరస్ పర్సన్: ట్రంప్ ఉద్వాసన: అభిశంసన: స్పీకర్ అత్యవసర తీర్మానం: సమయం లేదు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడికి గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ అనూహ్య పరిణామాలు నెలకొంటున్నాయి. రాజకీయ వాతావరణం శరవేగంగా మారిపోతోంది. వాషింగ్టన్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న తరువాత.. అధికారం నుంచి తప్పుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ.. ఆయనకు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. 25వ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే అవకాశాన్ని కేబినెట్ పరిశీలిస్తోంది. దీనిపై యూఎస్ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ సంకేతాలను కూడా ఇచ్చేశారు.

ఇతర రాష్ట్రాలకు పాకిన అల్లర్లు: గవర్నర్ కార్యాలయాలపై దాడికి ట్రంప్ మద్దతుదారుల ప్లాన్ఇతర రాష్ట్రాలకు పాకిన అల్లర్లు: గవర్నర్ కార్యాలయాలపై దాడికి ట్రంప్ మద్దతుదారుల ప్లాన్

 అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి..

అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి..


యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభల సమావేశాలన్ని ఉద్దేశించి న్యాన్సీ పెలోసీ ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. నిప్పులు చెరిగారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఒక్క క్షణం కూడా అధ్యక్షుడిగా కొనసాగే అర్హత ఆయనకు లేదని పేర్కొన్నారు. ట్రంప్‌కు ఉద్వాసన పలకడం అత్యవసర అంశమని, ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ ఆమె ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు సూచించారు.

ఫోటోలు: వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసనలు

 కేబినెట్ అంగీకరించకపోతే..

కేబినెట్ అంగీకరించకపోతే..

25వ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను ఉద్వాసన పలకడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని, దీనికి అవసరమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని న్యాన్సీ పెలోసీ ఆదేశించారు. దీనికి కేబినెట్ అంగీకరించకపోతే.. తనకు ఉన్న విచక్షణాధికారాలను యూఎస్ కాంగ్రెస్ వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని స్పీకర్ పెలోసీ స్వయంగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందే- డొనాల్డ్ ట్రంప్‌కు ఉద్వాసన పలకాలనే అభిప్రాయం.. ఆయన సొంత కేబినెట్‌లోనే వ్యకమైంది.

సమయం లేదు..

సమయం లేదు..

25వ చట్ట సవరణ ద్వారా డొనాల్డ్ ట్రంప్‌కు మంగళం పలకడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని యూఎస్ కేబినెట్ వెంటనే తీసుకోవాలని న్యాన్సీ పెలోసీ సూచించారు. దీనికోసం మైక్ పెన్స్.. ఎక్కువ సమయం తీసుకుంటారని తాను అనుకోవట్లేదని చెప్పారు. వెంటనే తీర్మానాన్ని రూపొందించాలని ఆదేశించారు. దీనిపై డెమొక్రాట్ల సభాపక్ష నేత ఛుక్ షుమెర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఒక్క రోజు కూడా పదవిలో కొనసాగే అర్హత డొనాల్డ్ ట్రంప్‌కు లేదని స్పష్టం చేశారు. దీనిపై మిగిలిన డెమొక్రాట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు రిపబ్లికన్ పార్టీ సభ్యులు సైతం మద్దతు పలికారు.

 ఉపాధ్యక్షుడికి అధ్యక్ష బాధ్యతలు..

ఉపాధ్యక్షుడికి అధ్యక్ష బాధ్యతలు..

అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడిని అర్ధాంతరంగా ఉద్వాసన పలికిన అనంతరం.. ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసే బాధ్యతను ఉపాధ్యక్షుడికి దక్కుతుంది. ఈ మేరకు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన సమయంలో అప్పటి ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిని చేశారు. దీనికోసం చట్టాన్ని సవరించారు. అదే 25వ చట్ట సవరణను తాజాగా డొనాల్డ్ ట్రంప్‌పైకి ప్రయోగించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. అదే జరిగితే.. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నియమితులు అవుతారు. మిగిలిన ఈ కొద్దిరోజుల పదవీ కాలాన్ని ఆయన భర్తీ చేస్తారు.

English summary
A growing number of lawmakers -- including from Democratic leadership -- are calling for President Donald Trump to be removed from office either through impeachment or the 25th Amendment to the Constitution after a violent mob of Trump supporters stormed the US Capitol on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X