వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెనెట్‌లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు: నేషనల్ గార్డుల ఆధీనంలో వాషింగ్టన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నేషనల్ సెక్కూరిటీ గార్డులు రంగంలోకి దిగారు. వాషింగ్టన్, డీసీ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమెరికా పార్లమెంట్.. కేపిటల్ బిల్డింగ్ సహా.. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ భవనం వద్ద సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి క్రిస్టొఫర్ మిల్లర్ వెల్లడించారు.

Recommended Video

Trump Called Kamala Harris As Most Horrible Senator నకిలీ నాయకురాలు అంటూ వీడియో ! || Oneindia Telugu

ట్రంప్‌కు వార్నింగ్: ట్విట్టర్ అకౌంట్ లాక్: ఫేస్‌బుక్ వీడియోలు డిలేట్: ఇంకోసారి ఇలా చేస్తే..!ట్రంప్‌కు వార్నింగ్: ట్విట్టర్ అకౌంట్ లాక్: ఫేస్‌బుక్ వీడియోలు డిలేట్: ఇంకోసారి ఇలా చేస్తే..!

1100 మందికి పైగా మోహరింపు..

వాషింగ్టన్ భద్రత మొత్తం ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఆందోళనకారులను రెచ్చగొట్టకుండా శాంతియుతంగా వారిని అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. నేషనల్ గార్డులను ప్రతిఘటించవద్దని ఆయన సూచించారు. 1100 మందికి పైగా నేషనల్ గార్డులను వాషింగ్టన్‌లోని సున్నిత ప్రాంతాల్లో మోహరింపజేశామని, అవసరమైతే మరిన్ని బలగాలను తరలించడానికి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాంటి పరిస్థితి తలెత్తకపోవచ్చని తాను భావిస్తున్నట్లు క్రిస్టొఫర్ మిల్లర్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికను ఆమోదించాల్సి ఉండగా..

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్‌ పేరును అధికారికంగా అమెరికా కాంగ్రెస్, సెనెట్ ఆమోదించాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఈ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలను వారు అడ్డుకున్నారు. పార్లమెంట్ భవనంలోనికి దూసుకెళ్లారు. రిపబ్లికన్ పార్టీ జెండాలను పట్టుకుని విధ్వంసానికి దిగారు. వాషింగ్టన్ పోలీసులు చేసిన ప్రయత్నాలను తిప్పి కొట్టారు. కొన్ని సందర్భాల్లో పోలీసులనూ ప్రతిఘటించారు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరింపజేయాల్సి వచ్చింది.

సమావేశాలు రద్దు..

అనూహ్యంగా ఆందోళనకారులు సభలోకి దూసుకుని రావడంతో సమావేశాలను అర్ధాంతరంగా రద్దు చేశారు. ఈ సమావేశాల సందర్భంగా ఎలక్టోరల్ కాలేజ్ నుంచి వచ్చిన బ్యాలెట్లను లెక్క పెట్టాల్సి ఉండగా.. ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆందోళనకారులు పార్లమెంట్ భవనాన్ని చుట్టు ముట్టడంతో యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, సెనెటర్లు చాలాసేపటి వరకూ లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. వ్యక్తిగత భద్రత సిబ్బంది సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందక్కడ. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. నేషనల్ సెక్యూరిటీ గార్డులను మోహరింపజేశారు.

అధికార మార్పిడి గడువు సమీపిస్తుండటంతో..

అమెరికాలో అధికార మార్పిడి గడువు సమీపిస్తోన్న కొద్దీ హింసాత్మక వాతావరణం నెలకొంటోంది. అగ్రరాజ్యం అమెరికా రాజధాని అట్టుడికిపోతోంది. ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన నేపథ్యంలో రాజధానిలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. వందల్లో కాదు.. వేలాది మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు రక్తసిక్తం అయ్యాయి. ప్రదర్శనకారులను అడ్డుకోవడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు.

English summary
The National Guard has been fully activated to deal with pro-Trump insurrectionists on Capitol Hill, acting Defense Secretary Christopher Miller announced Wednesday afternoon. As lawmakers met inside the Capitol to certify President-elect Joe Biden’s victory, Trump supporters stormed into the building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X