వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా స్పీకర్ కార్యాలయం ఫర్నిచర్ చోరీ: కొమ్ముల టోపీతో భయపెట్టిన ట్రంప్ సపోర్టర్: అరెస్టులు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అల్లర్లకు పాల్పడిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వందమందికి పైగా ఆందోళనకారులను వాషింగ్టన్ పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వారిపై ఛార్జిషీట్లను నమోదు చేశారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈ సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొమ్ముల టోపీ ధరించి, పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారుడు కూడా తాజాగా అరెస్టయిన వారిలో ఉన్నాడు.

వాషింగ్టన్‌లోని కేపిటల్ బిల్డింగ్‌పై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తిస్తుస్తున్నారు. కొమ్ములటోపీ, ముఖానికి రిపబ్లికన్ల ఎన్నికల గుర్తు రంగులను పూసుకుని ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తిని జాకబ్ ఆంథోని ఛాన్స్‌లే అలియాస్ జాక్ ఏంజెలిగా గుర్తించారు. అతను అరిజోనా నివాసిగా నిర్ధాంచారు. శనివారం సాయంత్రం అతణ్ని అరెస్ట్ చేసినట్లు వాషింగ్టన్ పోలీసులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. తనను తాను క్వానన్ డిజిటల్ వారియర్‌గా ప్రకటించుకున్నట్లు తెలిపారు.

Violence at US Capitol: Trump supporter in horns and fur is charged

యూఎస్ హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసీ కార్యాలయంలోకి దూసుకెళ్లి.. అక్కడి ఫర్నిచర్‌ను దొంగిలించిన ఆందోళనకారుడిని కూడా పోలీసులు గుర్తించారు. అతణ్ని ఆడమ్ జాన్సన్‌గా గుర్తించారు. స్పీకర్ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. దర్జాగా సీట్‌పై కాళ్లు మీద కాళ్లేసుకుని కూర్చున్న మరో ఆందోళనకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని అర్కాన్సస్ కారాగారానికి తరలించారు. 60 సంవత్సరాల రిచర్డ్ బెర్నెట్‌గా గుర్తించారు.

అలాగే.. వెస్ట్ వర్జీనియాకు చెందిన రైట్ వింగ్ లెజిస్లేటర్ డెరిక్ ఇవాన్స్ అరెస్ట్ అయ్యారు. నిషేధిత ప్రదేశంలో ఆయన తిరుగాడటంతో పాటు సెల్ఫీలను తీసుకున్నరనే ఆరోపణలు ఉన్నాయి. కేపిటల్ బిల్డింగ్‌లో ప్రవేశించిన అనంతరం సిగరెట్ తాగుతూ సెల్ఫీని తీసుకుంటూ సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన నిక్ ఓక్స్‌ను అరెస్ట్ చేశారు. ప్రౌడ్ బోయ్స్ హవాయ్ సంస్థ వ్యవస్థాపకుడిగా అతణ్ని గుర్తించారు. వాషింగ్టన్‌లో అల్లర్లలో పాల్గొన్న అతను హవాయ్‌కు బయలుదేరి వెళ్లగా.. అక్కడి విమానాశ్రయంలో నిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Federal authorities took Jacob Anthony Chansley, also known as Jake Angeli, of Arizona, into custody on Saturday and have charged him with "knowingly entering or remaining in any restricted building or grounds without lawful authority, and with violent entry and disorderly conduct on Capitol grounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X