వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతి

|
Google Oneindia TeluguNews

'ఏమో.. గుర్రం ఎగరావచ్చు..' అనే జమానా ఊహను.. గ్రాఫిక్స్ లో నిజం చేసి చూపిస్తారు ఈనాటి గడుగ్గాయిలు. ఇదిగో... 'ఆకాశంలో తేలుతోన్న ఓడ' ఫొటోను మొదటిగా చూసినవాళ్లంతా ఇదేదో గ్రాఫిక్ మాయాజాలం అనుకున్నారు. కానీ ఇందులో ఒక్క బిట్ గ్రిఫిక్ కూడా లేదు. అచ్చంగా కెమెరాతో చిత్రీకరించిందే..

జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులుజగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

టెక్నాలజీతోపాటే ఫేక్ ప్రచారాలూ వేగంగా వ్యాప్తి చెందుతోన్న రోజులివి. 'ఫ్యాక్ట్ చెక్' ఫిల్టర్లను దాటుకుంటూ మరీ గ్రాఫిక్ వీడియోలు, ఫొటోషాప్ చిత్రాలు వైరలైపోతున్న వైనం మనమంతా చూస్తున్నాం. అందుకే కాబోలు, చాలా రోజుల తర్వాత ఒరిజినల్ వండర్ లా అగుపించింది కాబట్టే ప్రస్తుతం ఇది వైరల్ ఫొటోగా మారింది. వివరాల్లోకి వెళితే..

viral photo: Is this ship floating across the sky? See viral optical illusion

నీటిపై ప్రయాణించాల్సిన ఓడ.. ఆకాశంలో తేలుతున్నట్లు కనిపిస్తోన్న ఈ దృశ్యం కెనడాలోని బాన్ఫ్ పట్టణంలో కనిపించింది. కొలిన్ మెక్‌కల్లమ్‌ అనే రోడ్డుపై కారులో వెళుతుండగా.. ఎదురుగా ఉన్న సముద్ర తలానికిపైన.. ఆకాశంలో కార్గొ షిప్ తేలాడుతున్నట్లుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయిన కొలిన్.. తాను దృష్టి భ్రాంతికి గురయ్యానని గ్రహించాడు. వెంటనే..

viral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లుviral video:మేయర్ మందు కొట్టిందా? -విజయలక్ష్మికి జనం కన్నా కుక్కలే కరెక్టు -ఆర్జీవీ అనుచిత కామెంట్లు

కొలిన్ తన మొబైల్‌లో ఆ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. 'ఇవాళ రియల్ లైఫ్ ఆప్టికల్ ఇల్యూషన్' చూశానంటూ కొలిన్ పోస్ట్ చేసిన ఫొటో గంటల వ్యవధిలోనే ప్రపంచం నలుమూలలకు పాకింది. సముద్రం అలలపై మబ్బుల నీడ పడటంతో ఆ ఓడ ఉన్న చోటు ఆకాశంగా కనిపించిందని, దీంతో ఆ షిప్‌ గాల్లో తేలుతున్నట్లుగా ఉన్నదని నిపుణులు తేల్చేశారు. సముద్ర తీరంలో మేఘాలు కమ్ముకుని ఉండటం కూడా ఓ కారణమని ఇంకొందరు చెబుతున్నారు. అదీ సంగతి.

viral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతి

English summary
An optical illusion that appears to show a 'floating ship' went viral on social media after user Colin McCallum from canada shared the image in a post on Facebook. "Saw a real-life optical illusion in Banff today," Colin McCallum said in the caption of his post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X