• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video: అధ్యక్షుడి చెంప ఛెళ్లు -ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌‌కు ఘోర పరాభవం

|

వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో హైసెక్యూరిటీ నడుమ దాదాపు ఆసియా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల్ని సామాన్యులు నేరుగా తాకలేరు. ఇక అమెరికా సంగతి తెలిసిందే. అటు యూరప్ దేశాల్లోనైతే పాలకులు నేరుగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం సర్వసాధారణంగా జరిగేదే. గొప్పగా భావించే ఆ సంస్కృతి రాబోయే రోజుల్లో చూడలేమేమో. యూరప్ సాంస్కృతిక రాజధాని ఫ్రాన్స్ దేశంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన అలాంటిదే మరి..

ట్విస్ట్: వ్యాక్సిన్ ధరలు కంపెనీల ఇష్టం -రాష్ట్రాలే ప్రైవేటుకు సరఫరా -44కోట్ల డోసులకు ఆర్డరిచ్చాం: కేంద్రంట్విస్ట్: వ్యాక్సిన్ ధరలు కంపెనీల ఇష్టం -రాష్ట్రాలే ప్రైవేటుకు సరఫరా -44కోట్ల డోసులకు ఆర్డరిచ్చాం: కేంద్రం

కొవిడ్ సడలింపుల వేళ..

కొవిడ్ సడలింపుల వేళ..

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌కు ఘోర పరాభావం ఎదురయ్యింది. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో దేశం నలుమూలా పర్యటిస్తోన్న ఆయన.. మంగళవారం నుంచే భారీ సడలింపులు ప్రకటించారు. ‘ఈరోజు నుంచి జనజీవనం మళ్లీ దారిన పడబోతోంది' అని ప్రెసిడెంట్ ట్వీట్ కూడా చేశారు. దేశంలోని రెస్టారెంట్లు, హోటళ్లు మళ్లీ తెరుచుకుంటోన్న శుభసందర్భాన ప్రజల్ని నేరుగా కలిసిన ఆయన చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది..

జగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణజగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణ

దేశాధ్యక్షుడి చెంప పగిలింది..

దేశాధ్యక్షుడి చెంప పగిలింది..

దేశ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌ ఇవాళ ఆగ్నేయ ఫ్రాన్స్‌కు వెళ్లారు. అక్కడి డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి, కొవిడ్ ప్రొటోకాల్స్ ను చెక్ చేసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు కారు వద్దకు బయలుదేరారు. అయితే, అప్పటికే అధ్యక్షుడిని చూసేందుకు అక్కడ జనం గుమ్మికూడటంతో మాక్రాన్ బారికేడ్ల దగ్గరికెళ్లి వారితో కరచానలాలుచేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు అధ్యక్షుడికి షేక్ హ్యాడ్ ఇచ్చినట్లే ఇచ్చి చెంప పగలకొట్టాడు. అనూహ్య సంఘటనతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు..

మాక్రాన్ అతివాద ధోరణి నచ్చక..

అధ్యక్షుడు మాక్రాన్ ను చెంపదెబ్బ కొట్టిన యువకుడితోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తినీ సెక్యూరిటీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు సమయంలో ఆ యువకుడు మాక్రాన్ అతివాద ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, చెంపదెబ్బ తర్వాత అధ్యక్షుడు మళ్లీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దేశాధ్యక్షుడిపై యువకుడు చేయిచేసుకోవడాన్ని రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్యంలో చర్చకు, వాదనలకు మాత్రమే చోటుంటుందని, దాడులకు కాదని ఫ్రాన్స్ ప్రధాని జేన్ కాస్టెక్స్ జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిని యువకుడు చెంపదెబ్బ కొట్టిన వీడియో నెట్టింట వైరలైంది. మితిమీరిన జాతీయవాదం, ముస్లిం వ్యతిరేకత, నియంత పోకడలను ప్రదర్శిస్తున్నారని మాక్రాన్ పై ఆరోపణలుండటం తెలిసిందే.

English summary
French President Emmanuel Macron has been slapped in the face on an official visit to the south-east of France. In a video circulating on social media, Mr Macron is seen walking up to a barrier on a trip to Tain-l'Hermitage outside the city of Valence. A man in a green T-shirt slaps Mr Macron in the face before officers quickly move in. The president, meanwhile, is pulled away. Two men have been arrested following the incident, French media report. The man reportedly shouted "Down with Macron-ism" as he slapped the president. In the video Mr Macron briefly returned to the barrier after the incident and once again interacted with the crowd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X