• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

viral video:సింహం కూనపై కౄరత్వం -మత్తు ఇచ్చి వెడ్డింగ్ ఫొటో షూట్ -పాకిస్తాన్ జంటకు శాపనార్థాలు

|

రోజురోజుకూ క్రేజీగా మారుతోన్న యువతరం ప్రతిదాంట్లోనూ క్రియేటివిటీ కోరుకుంటోంది. ప్రాణంగా భావించే ఫొటోల విషయం మాత్రం అసలే కాంప్రమైజ్ కాబోమని అంటుంది. చోటామోటా ఈవెంట్లకే నానా హంగామా చేసే ఈతరం.. ఇక వెడ్డింగ్ షూటంటే ఊరుకుంటుందా? భూగోళంలో ఏ మూలకు వెళ్లినా ఇదే తంతు. భారత్ పొరుగునే ఉన్న పాకిస్తాన్ లోనైతే క్రేజీనెస్ కు ఇంకాస్త పిచ్చెక్కిస్తూ సాగిన ఫొటోల వవహారం విపరీతంగా వైరలైంది..

రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్‌బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?

కమలానికి పవన్ విడాకులేనా? -బీజేపీ వల్ల జనసేనకు భారీ నష్టం -తిరుపతిలో ఒంటరిగా బరిలోకి!

 సింహం కూనతో ఫొటోలు..

సింహం కూనతో ఫొటోలు..

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ల కోసం జంటలు పడుతోన్న పాట్ల తాలూకు వీడియోలు, ఫొటోలు ఇదివరకే మనం చాలా చూశాం. తాజాగా పాకీస్థాన్ కు చెందిన మరో జంట ఇంకాస్త అతికిపోయి, ఏకంగా సింహం కూనతోనే వెడ్డింగ్ షూట్ కు సిద్దమైంది. పాకిస్తాన్ లోని రెండో అతిపెద్ద నగరం లాహోర్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియోలు వైరల్ అయ్యాయి.

మూగ జీవానికి మత్తు మందు..

మూగ జీవానికి మత్తు మందు..

ఓ సింహం కూనకు మత్తుముందు ఇచ్చి.. దాన్ని పక్కన పెట్టుకుని కాబోయే వధువరులు ఫోటోలను ఫోజులిచ్చారు. పలు యాంగిల్స్ లో ఫోటోలు తీసుకుని మురిసిపోయారు. షూట్ జరుగుతున్న సమయంలో సింహం కూనకు మత్తు మందు ఇవ్వగా, సగం మగతలోనే అది కదలకుండా, నిద్రపోలేకుండా ఉండిపోయింది. అప్పుడు దానిపై చేతులేసి ఠీవిగా పోజులిచ్చిందా జంట. దీనిని

 బుద్దుందా మీకు?

బుద్దుందా మీకు?

లాహోర్ సిటీలో వెడ్డింగ్ షూట్లకు ఫేమసైన అఫ్జల్ స్టుడియోలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడైంది. ‘షేర్డీ రాణీ' అనే హ్యాష్ ట్యాగ్ తో ఇది నెట్టింట వైరలైంది. అందులోని దృశ్యాలను చూసి జంతు ప్రేమికులు మండిపడ్డారు. ఒక సింహం కూనకు మత్తు మందు ఇఛ్చి పెళ్ళిలో దాన్ని ప్రాపగాండా కోసం వాడుకోవడమేమిటని వారు దుయ్యబట్టారు. పాక్ లోని ‘సేవ్ ది వైల్డ్' అనే జంతు కారుణ్య సంస్థ.. సదరు మీడియోను ట్విటర్ లో షేర్ చేస్తూ.. ఇది జంతు హింస కిందికే వస్తుందని, సింహం కూనను అధికారులే కాపాడాలని కోరింది. అయితే..

పాకిస్తాన్‌లో అంతే అంతే..

సింహం కూనతో ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ ఘటనపై అంతర్జాతీయంగా రచ్చ కొనసాగుతుండగా, స్థానిక గ్రూపులు కొన్ని మాత్రం భిన్నవాదనను వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో ఎవరైనా కౄరజంతువును పెంచుకుంటామంటే లైసెన్స్ పొందొచ్చని, బహుశా ఫోటో స్థూడియో ఓనర్ ఆ మేరకు లైసెన్స్ కలగి ఉండొచ్చని, అయినా, షూట్ లోని జంట.. సింహం కూనకు హాని తలపెడుతున్నట్లుగా దృశ్యాలేవీ లేవని ఇంకొందరు వాదించారు. ఏది ఏమైనా సింహం పిల్లకు మత్తు ఇచ్చి సరదాలు తీర్చుకోవడం సరికాదని మెజార్టీ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ సరికొత్త రికార్డు -సగానికిపైగా ఓట్లు వైసీపీకే -భారీగా తగ్గిన టీడీపీ షేర్ -మున్సిపోల్స్ ఓటింగ్ శాతం ఇలా

English summary
APakistani couple was severely criticised on social media after the bride and the groom decided to use a sedated lion cub as a prop during their wedding photoshoot. The images from their wedding photoshoot were posted to Instagram - on Studio Afzl's stories, which is a Lahore-based photography studio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X