• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..

|

'ప్రకృతిపై ప్రేమంటూ వికృతానికి పాల్పడుతావా?'.. ''డబ్బు మదం తలకెక్కితే ఇలాంటి పనులే చేస్తారు మరి..', 'అసలే అది అంతరించిపోతోన్న ఏనుగు జాతి.. దాంతో ఆటలాడటానికి సిగ్గు లేదా నీకు..'', 'ఆహా.. ఆ ఏనుగును నేనైనా కాకపోతినే.. '' ఇవీ.. కొద్ది గంటలుగా ప్రపంచాన్ని షేక్ చేస్తోన్న ఓ వైరల్ వీడియోపై నెటిజన్లు చేస్తోన్న కామెంట్లు. కూతురు చేసిన పనికి పాపం టెన్నిస్ లెజెండ్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

లదాక్‌లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులులదాక్‌లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు

ఏనుగుపై నగ్నంగా..

ఏనుగుపై నగ్నంగా..

ఆమె పేరు అలేస్య కాఫెల్నికోవా. వయసు 22. గతంలో ప్రపంచ ఛాపియన్‌షిప్‌ను సైతం గెలుచుకున్న రష్యన్ లెజెండ్ యెవ్‌జెనీ కాఫెల్నికోవా కూతురు. మోడలింగ్ రంగంలో రాణిస్తోన్న ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో ఆమెను ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్'గానూ భావిస్తారు. ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలి దీవిలో హాలిడే ట్రిప్పును ఎంజాయ్ చేస్తోన్న ఆమె.. అనూహ్య చర్యకు పాల్పడింది. ఏనుగుపై నగ్నంగా పడుకొని ఫొటోలకు పోజులిచ్చింది. సదరు ఏనుగు.. అంతరించిపోతోన్న సమత్రా జాతిది కావడంతో ఆమె ఫొటోషూట్, వీడియోలపై జంతుకారుణ్య సంఘాలతోపాటు నెటిజన్లూ మండిపడుతున్నారు.

ఇదేనా మానవ స్వభావం?

ఇదేనా మానవ స్వభావం?

ఏనుగుపై నగ్నంగా ఊరేగుతూ, అసభ్యకరమైన రీతిలో దాన్ని తాకుతూ అలేస్య దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ‘‘నేచురల్ వైబ్స్'' కాప్షన్‌తో ఏనుగుపై నగ్నంగా పడుకున్న ఫొటోలను అలేస్యా ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీపై అప్‌లోడ్ చేసింది. దానికి ‘‘ప్రకృతిని ప్రేమించడం మానవ స్వభావం'' అనే కామెంట్ ను జోడించింది. మూగజీవాలతో క్రూరంగా వ్యవహరించడమే మానవ స్వభావమా? అంటూ నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘సేవ్ ది ఆసియన్ ఎలిఫాంట్స్''అనే జంతుకారుణ్య సంస్థ.. అలేస్యా చర్యను విషాదకర సంఘటనగా అభివర్ణించింది. నిజానికి..

అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీఅసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీ

అంతరిస్తోన్న జాతితో ఆటలా?

అంతరిస్తోన్న జాతితో ఆటలా?

రష్యన్ మోడల్ అలేస్యా నగ్నంగా పోజులిచ్చిన ఏనుగు.. సుమత్ర జాతికి చెందినది. ఇష్టారీతిగా అడవుల నరికివేత, దంతాల కోసం స్మగ్లర్ల వేట కారణంగా ఆ జాతి క్రమంగా అంతరించిపోతున్నది. నేషనల్ జియోగ్రాఫిక్ వారి లెక్కల ప్రకారం సమత్ర జాతి ఏనుగుల సంఖ్య కేవలం 700 నుంచి 1000లోపే ఉంటుంది. సమత్ర జాతి ఏనుగుల సహజ ఆవాసాలన్నీ ధ్వంసమైపోతుండగా, కొన్నిటిని బాలీ దీవికి తరలించి పరిరక్షిస్తున్నారు. ఇండోనేషియా టూరిజం అభివృద్ధిలో సమత్రా ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఏనుగుపై నగ్నంగా పోజులిచ్చిన మోడల్ అలేస్యాపై చర్యలు తీసుకోవాలంటూ ఇండోనేషియా అధికారుల్ని జంతుకారుణ్య సంఘాలు కోరుతున్నాయి.

English summary
A video is going viral on the internet where a 22-year-old social media influencer named Alesya Kafelnikova is seen posing naked on top of an endangered Sumatran elephant. Notably, the model is also the daughter offormer world tennis player Yevgeny Kafelnikov. she was condemned by animal group for posing naked on an elephant
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X