వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది చూశాక కూడా సిగరెట్ వెలిగిస్తారా?: స్మోకింగ్ వర్సెస్ నాన్ స్మోకింగ్(వీడియో)

|
Google Oneindia TeluguNews

నార్త్ కరోలినా: వ్యసనాలతో జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకునేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా సిగరెట్, గుట్కా, ఆల్కాహాల్ వంటి వాటికి బానిసై క్యాన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవాళ్లు ఏటా కొన్ని లక్షలమంది.

స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని తెలిసీ కూడా.. దాన్నో స్టైల్ స్టేటస్ లా ఫీలయ్యే యూత్ కి ఈరోజుల్లో కొదువలేదు. అలాంటివాళ్లంతా రియలైజ్ అయ్యేలా నార్త్ కరోలినాకు చెందిన ఓ డాక్టర్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

'రోజుకు ఒక సిగరెట్ ప్యాకెట్ చొప్పున 20ఏళ్ల పాటు స్మోక్ చేసి క్యాన్సర్ సోకిన ఊపిరితిత్తులు వర్సెస్ ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు, ఇది చూశాక కూడా స్మోక్ చేయాలనుకుంటున్నారా?' అంటూ సదరు డాక్టర్ ఆ వీడియో ద్వారా పొగరాయుళ్లను ప్రశ్నించారు.

వీడియోలో క్యాన్సర్ సోకిన ఊపిరితిత్తులు పూర్తిగా పాలిపోయి నలుపు రంగులో ఉండటం, ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు మాత్రం ఎరుపు రంగులో ఉండటం గమనించవచ్చు. క్యాన్సర్ సోకిన ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకపోవడం కూడా గమనించవచ్చు.

సోషల్ మీడియాలో ఇప్పటిదాకా ఈ వీడియోకు 42మిలియన్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. వీడియో చూశాక చాలామంది నెటిజెన్స్ స్మోకింగ్ కు దూరంగా ఉండటం బెటర్ అంటూ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. పొగాకు ప్రపంచ ఆరోగ్యానికి పెనుముప్పుగా తయారైంది. పొగాకు సంబంధిత ఉత్పత్తులు వాడటం వలన దాదాపుగా ప్రతీ సంవత్సరం 7లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ సంవత్సరం మే 31న 'వరల్డ్ నో స్మోకింగ్ డే'ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
If you've been looking for a reason to kick the butt or haven't been able to muster enough willpower to quit smoking, these videos may just do the job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X