వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైలెట్ చాకచక్యం... తప్పిన పెను ప్రమాదం, 447 మంది సురక్షితం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: లండన్ నుంచి లాస్‌వేగాస్ వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ విఎస్43 బోయింగ్ 747 విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉన్నట్లు కనుగొన్న ఫైలెట్ చాకచక్యంగా వ్వవహరించి 447 మంది ప్రయాణీకులను కాపాడాడు.

ల్యాండింగ్ గేర్ వేస్తే తెరచుకోవాల్సిన నాలుగు టైర్ బాక్స్‌లలో మూడే తెరచుకున్నాయి. దీంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్ యూకేలోని గాట్విక్ ఎయిర్‌ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దింపాడు. లండన్‌లోని గాట్విక్ రన్ వే ప్రపంచంలోనే అత్యుత్తమ రన్ వేలలో ఒకటి.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

గాట్విక్ విమానాశ్రయంలో విఎస్43 బోయింగ్ 747 విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు వర్జిన్ అట్లాంటిక్ అధికారులు గుర్తించారు. విమానం దిగేటప్పుడు ఒక వైపు ఒరిగి పక్కకు జారుతున్నట్లు కనిపించింది.

Virgin Atlantic pilot lands 447 passengers safely in Gatwick drama

ఆ సమయంలో విమానం వెళ్తున్న దిశను పైలట్ కాస్త మార్చారు. అలా చేయకుంటే విమానం కుడివైపు ఒరిగి పెను ప్రమాదం జరిగేదని తెలిపారు. పైలెట్ నైపుణ్యం కారణంగా ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.

విఎస్43 బోయింగ్ 747 విమానం ల్యాండ్ అయిన తర్వాత హుటాహుటిన ఎమర్జెన్సీ సర్వీసులు అక్కడకి చేరుకున్నాయి. విమానంలో ఉన్న ప్రయాణీకులు అంతా చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. విమానంలో ఉన్న 447మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన ఫైలెట్‌ను వర్జిన్ అట్లాంటిక్ సీఈఓ రిచర్డ్ బ్రాసన్ ట్విట్టర్‌లో కొనియాడారు.

English summary
A Virgin Atlantic plane carrying 447 passengers was forced to make an emergency landing at Gatwick after landing gear problems hit a US-bound flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X