వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు విటమిన్ ‘డి’ చికిత్స.. 60 శాతం తగ్గిన మరణాలు: స్టడీ

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్‌కు విటమిన్ డి ద్వారా ట్రీట్‌మెంట్ చేయొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా చికిత్సలో భాగంగా బాధితులకు తక్షణమే విటమిన్ డి వాడటం ప్రారంభించాలని పరిశోధకులు సజెస్ట్ చేస్తున్నారు. కరోనా చికిత్సకు విటమిన్ డి ద్వారా చికిత్స చేసే బాధితుల్లో 60 శాతం కరోనా మరణాలు తగ్గినట్టు తేలిందని అంటున్నారు.

సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్ వర్క్ ప్రచురించిన అధ్యయనంలో ఈ విషయం రూడీ అయ్యిందని మాజీ బ్రిగ్జిట్ సెక్రటరీ ఎంపీ డేవిడ్ దేవిస్ వెల్లడించారు. calcifediol అనే విటమిన్ డి3 కరోనా చికిత్సలో సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయనంలో తేలిందని చెప్పారు. స్పెయిన్‌లో కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన 550 మందికి పైగా బాధితుల్లో వారి వార్డుల్లో 'డి' విటమిన్ ఇచ్చి పరీక్షించారు. వీరిపై calcifediol చికిత్స ఎలా పనిచేస్తుందో ట్రయల్ ద్వారా అధ్యయనం చేశారు.

vitamin d in coronavirus treatment reduces deaths by 60 per cent: study

15 రోజుల వ్యవధిలో రెండు, నాలుగు, ఎనిమిది చొప్పున పెంచుతూ విటమిన్ ఐదు మోతాదుల్లో కరోనా బాధితులకు ఇచ్చారు. ప్రతి ఆస్పత్రిలోని కరోనా బాధితుల టెంపరేచర్ సహా లక్షణాల తీవ్రతపై లోతుగా అధ్యయనం చేశారు. దీని ద్వారా వేలాది మందిని కరోనా మరణాల నుంచి కాపాడటం సాధ్యపడిందని రీసెర్చర్లు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా విటమిన్ డి ట్రీట్ మెంట్ కరోనా బాధితులకు ఇవ్వడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. విటమిన్ డి చికిత్స తీసుకున్న కరోనా బాధితుల్లో 80 శాతం వెంటిలేటర్ అవసరం అవకాశం లేదని అధ్యయనంలో తేలింది.

English summary
vitamin d in coronavirus treatment reduces deaths by 60 per cent study claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X