వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభేదాలున్నా..! జో బైడెన్‌కు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు, ఇప్పుడే ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

మాస్కో: ఎట్టకేలకు రాష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజంయ సాధించిన జో బైడెన్‌కు అభినందనలు తెలిపారు. ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే పుతిన్ అభినందనలు తెలపడం గమనార్హం. కొద్ది రోజులు వేచిచూసిన చైనా కూడా ఇటీవలే బైడెన్‌కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

జో బైడెన్‌కు అన్ని విషయాల్లోనూ విజయమంటూ పుతిన్

జో బైడెన్‌కు అన్ని విషయాల్లోనూ విజయమంటూ పుతిన్

అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్ని విషయాల్లోనూ విజయం సాధించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు. రష్యా, అమెరికాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఇరుదేశాలు ప్రత్యేక బాధ్యతతో ముందుకెళ్తాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

విభేదాలున్నా.. కలిసే ముందుకు..

విభేదాలున్నా.. కలిసే ముందుకు..

అంతేగాక, సమానత్వ భావం, పరస్పర గౌరవంతో ఇరుదేశాల ప్రజల ప్రయోజనాలతోపాటు అంతర్జాతీయ సమాజ శ్రేయస్సు కోసం సహకరిస్తామని పుతిన్ వెల్లడించారు. ఇక బైడెన్‌తో కలిసి చర్చించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్ష భవనం పేర్కొంది. కాగా, రష్యా, అమెరికాలకు పలు అంశాల్లో ఎప్పట్నుంచో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే అభినందనలు తెలిపిన చైనా

ఇటీవలే అభినందనలు తెలిపిన చైనా

మరోవైపు అమెరికా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని భారీ విజయాన్ని నమోదు చేసిన డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు భారత్ సహా ప్రపంచ దేశాధినేతలు ఇప్పటికే అభినందనలు తెలియజేశారు. చైనా, రష్యాలు మాత్రం అభినందనలు తెలుపకుండా ఉండిపోయాయి. ఇటీవలే చైనా.. బైడెన్‌కు అభినందనలు తెలిపింది. అయినా పుతిన్ మాత్రం చెప్పలేదు.

వ్లాదిమిర్ పుతిన్ అందుకే ఇప్పుడు కంగ్రాట్స్ చెప్పారు..

వ్లాదిమిర్ పుతిన్ అందుకే ఇప్పుడు కంగ్రాట్స్ చెప్పారు..

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో దావా వేయడం వంటి కారణాలతో పుతిన్.. బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు నిరాకరించారు.

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ను అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగాప్రకటించిన తర్వతే ఆయనను అభినందిస్తానన్న పుతిన్.. చెప్పినవిధంగానే చేశారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ను, ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్‌లను తాజాగా ఎలక్టోరల్ కాలేజీ ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ వారిరువురికీ అభినందనలు తెలియజేశారు.

English summary
Russian President Vladimir Putin on Tuesday congratulated Joe Biden on winning the US presidential election in November, saying he hoped the countries could set aside their differences to promote global security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X