• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రమాదకర వ్యాధి బారిన పుతిన్: ఇంకో రెండు నెలలే: రష్యా అధ్యక్ష పదవికి గుడ్‌బై?: గర్ల్‌ఫ్రెండ్

|

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారా?, ఇంకో రెండునెలల్లో ఆయన వైదొలబోతున్నారా?, స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా?, దీనికి కారణమేంటీ?.. ప్రస్తుతం రష్యాలో దావానలంలా మారిన ప్రశ్నలు ఇవి. వచ్చే ఏడాది ఆరంభంలోనే పుతిన్.. తన పదవికి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అనారోగ్య సమస్యలేనని తెలుస్తోంది.

పార్కిన్సన్ లక్షణాలు..

పార్కిన్సన్ లక్షణాలు..

వ్లాదిమిర్ పుతిన్‌లో పార్కిన్సన్ లక్షణాలు కనిపిస్తున్నాయని, అందుకే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు రష్యన్ మీడియా అంచనా వేస్తోంది. ఇటీవలే చిత్రీకరించిన ఓ వీడియో ఫుటేజీని దీనికి సాక్ష్యంగా చూపిస్తున్నాయి. 68 సంవత్సరాల వయస్సున్న వ్లాదిమిర్ పుతిన్‌కు రష్యన్ స్ట్రాంగ్ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. ఆయనకు పార్కిన్సన్ వ్యాధి సోకిందనే విషయాన్ని ఈ వీడియో ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నట్లు ది సన్ వెల్లడించింది.

జనవరిలో రాజీనామా..

జనవరిలో రాజీనామా..


ఆరోగ్యం బాగా లేదని, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ వ్లాదిమిర్ పుతిన్ గర్ల్‌ఫ్రెండ్, మాజీ జిమ్నాస్ట్ ఎలీనా కబాయెవా ప్రాధేయపడటం ఈ వీడియో ఫుటేజీలో రికార్డయింది. దీనికి ఆయన చిరునవ్వుతో అంగీకరించినట్లు చెబుతున్నారు. పుతిన్ ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, ఆయన కాళ్లు స్వల్పంగా వణుకుతుండటం వీడియోలో ఉందని, అలాగే అరచేతులు కూడా స్వాధీనంలో లేవని భావిస్తున్నారు.

కాళ్లు, చేతుల్లో వణుకు..

కాళ్లు, చేతుల్లో వణుకు..

అరచేతులను తన స్వాధీనంలో ఉంచుకోవడానికి, గ్రిప్ కోసం ఓ పెన్‌ను ఆయన ఎప్పుడూ పట్టుకుని కనిపిస్తున్నారని రష్యన్ మీడియా అభిప్రాయపడింది. అలాగే- ఈ మధ్యకాలంలో ఆయన తరచూ పెయిన్ కిల్లర్లను అధికంగా వినియోగిస్తున్నారనే విషయాన్ని వెల్లడించింది. ఆ వీడియో ఫుటేజీని పరిశీలించిన తరువాత- పుతిన్‌ను పార్కిన్సన్ వ్యాధి సోకినట్లు నిర్ధారించుకోవాల్సి వచ్చిందని మాస్కో‌కు చెందిన పొలిటికల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ వ్యాలెరీ సొలొవొయ్ తెలిపారు.

కొత్త వారసుడి కోసం..

కొత్త వారసుడి కోసం..

ఈ అనారోగ్య కారణాల వల్లే పదవి నుంచి తప్పుకోవాలంటూ ఎలీనా బహిరంగంగా పుతిన్‌ను విజ్ఙప్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుందని వ్యాలెరీ పేర్కొన్నారు. కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా పుతిన్‌.. తన గర్ల్‌ఫ్రెండ్ మాటలను వింటారని చెప్పారు. దీనికి అనుగుణంగా వచ్చే జనవరిలో ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. రష్యా ప్రభుత్వంలో తనకు ఉన్న పరిచయాల ఆధారంగా ఈ విషయాన్ని తాను వెల్లడిస్తున్నానని వ్యాలెరీ పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రస్తుతం పుతిన్ వారసుడిని ఎంపికక చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు.

జపాన్ తరువాత..

జపాన్ తరువాత..

జపాన్ ప్రధానమంత్రి షింజో అబే.. అనారోగ్య కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కోలిటిక్స్ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. పెద్ద ప్రేగునకు సంబంధించిన వ్యాధి అది. నయం కాకపోవచ్చనే అనుమానాలు ఇదివరకు విస్తృతంగా వినిపించాయి. ఇప్పుడా అనుమానాలను నిజం చేసేలా.. షింజో తప్పుకొన్నారు. ఎనిమిదేళ్లుగా తాను దీన్ని అదుపులో ఉంచుకుంటూ వచ్చానని, ఇప్పుడా పరిస్థితి లేదని షింజో స్పష్టం చేశారు. అదే బాటలో తాజాగా రష్యన్ స్ట్రాంగ్‌మ్యాన్ వ్లాదిమిర్ పుతిన్ రాజీనామా చేయడం ఖాయమని అంటున్నారు.

English summary
Vladimir Putin is planning to quit early next year amid growing fears for his health, Moscow sources claimed last night. Kremlin watchers said recent tell-tale footage showed the 68-year-old strongman has possible symptoms of Parkinson’s Disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X