• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రుడిపై తొలి 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్! వచ్చే ఏడాదే వొడాఫోన్ ప్రయోగం...

By Ramesh Babu
|
  Vodafone Planning To Start 4G Network On Moon

  బెర్లిన్: టెలికాం రంగంలో ఏటా అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. ఇప్పటికే 4జీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 5జీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా చంద్రుడిపై 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి.

  అవును, ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు జాబిల్లిపై 4జీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. వొడాఫోన్ జర్మనీ ఈ బృహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే 2019లో.. అంటే వచ్చే ఏడాదే చందమామపై 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఏర్పాటవుతుంది.

  50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి...

  50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి...

  అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా'కు చెందిన వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై నడిచి దాదాపు 50 ఏళ్లు పూర్తికావస్తోంది. ఇప్పుడు మళ్లీ అంతరిక్ష పరిశోధనల భవిష్యత్తును నిర్దేశించే బృహత్తర ప్రయత్నం జరగబోతోంది. 2019లో అంటే.. వచ్చే ఏడాదే మరోసారి చంద్రయానం చేయబోతున్నారు. కొన్ని ప్రముఖ సంస్థలన్నీ ఒక కన్సార్టియంగా ఏర్పడి ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాయి.

   చంద్రుడిపై తొలి 4జీ నెట్‌వర్క్...

  చంద్రుడిపై తొలి 4జీ నెట్‌వర్క్...

  వచ్చే ఏడాది చంద్రునిపై 4జీ కవరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ప్రయత్నాలు ప్రారంభించింది. వొడాఫోన్ జర్మనీ ఈ బృహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ పార్ట్‌నర్‌గా నోకియాను నియమించుకొంది. ప్రైవేట్ రంగంలో బెర్లిన్‌కు చెందిన స్పేస్ కంపెనీ పార్ట్ టైం సైంటిస్టుల కంపెనీ సహకారంతో వొడాఫోన్ జర్మనీ, నోకియా ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారిగా చందమామపై ఈ ఘనత సాధించాలని ప్రయత్నిస్తున్నాయి.

   తొలిసారిగా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో...

  తొలిసారిగా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో...

  తొలిసారిగా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో ‘మిషన్ మూన్‌' ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. 2019లో చంద్రుడి మీద 4జీ ‌వైర్‌లెస్ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం నోకియా, ఆడి సంస్థలు వొడాఫోన్‌తో చేతులు కలిపాయి. వొడాఫోన్ జర్మనీ పీటీ సైంటిస్ట్స్ కంపెనీతో కలిసి ఈ చంద్రయానం ప్రాజెక్టు చేపట్టనుంది. 2019లో కేప్ కెనవరాల్ నుంచి స్పేస్ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ మూన్ ప్రయోగం చేపట్టనున్నారు.

   ఎందుకీ ప్రాజెక్టు అంటే....

  ఎందుకీ ప్రాజెక్టు అంటే....

  చంద్రుడిపై పరిశోధనల వివరాలు, అక్కడ తీసే చిత్రాలు ఎప్పటికప్పుడు స్పష్టమైన నాణ్యతతో భూమి మీది అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని మిషన్ కంట్రోల్‌కు అందించేందుకు ఈ 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ అవసరమవుతుంది. వొడాఫోన్ చంద్రుడిపై ఏర్పాటు చేసే నెట్‌వర్క్ ద్వారా 1800MHz ఫ్రీక్వెన్సీ కలిగిన 4జీ సేవలు లభిస్తాయి. దీని ద్వారా చంద్రుడిపై చిత్రించే హెచ్‌డీ వీడియోలు బెర్లిన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరవేస్తారు. ఈ 4జీ నెట్‌వర్క్‌ను చంద్రుడి మీద వినియోగించే రెండు ఆడీ లూనార్ క్వట్ట్రో రోవర్లకు అనుసంధిస్తారు. దీంతో తొలిసారి లైవ్-స్ట్రీమింగ్ ద్వారా చంద్రుడికి సంబంధించిన హెచ్‌డీ వీడియోను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూడగలుగుతారు.

  ఇదో బృహత్తర ప్రయోగం...

  ఇదో బృహత్తర ప్రయోగం...

  ఈ సందర్బంగా పీటీ సైంటిస్ట్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రాబర్ట్ బహ్మే మాట్లాడుతూ... ‘ఇదో బృహత్తర ప్రయోగం. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తలపెడుతోన్న తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ ఇది. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2019లో చంద్రయానం చేపట్టనున్నాం. ఈ సందర్భంగా అక్కడి పరిశోధనల వివరాలను ఎప్పటికప్పుడు స్పష్టమైన చిత్రాలతో అందించేందుకు ఈ 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నాం..' అని పేర్కొన్నారు.

  English summary
  Several companies announced on Tuesday a joint effort to bring mobile phone coverage to the moon in 2019. A 4G wireless network is set to be installed on the moon by Vodafone, Nokia, Audi and SpaceX. The installation is scheduled to occur 50 years after NASA astronauts first walked on the lunar surface.The goal of the network is to support future missions to the moon by allowing communications between two lunar rovers, for example. Vehicles and astronauts on the moon would have a much easier time communicating with each other through a lunar network than depending on signals beamed down to earth and sent back up to the lunar surface. "This will be the first privately-funded moon landing mission. It will lay the future of space exploration. The cost less than what it cost for full mission lab. We will be below USD 50 million mark," Robert Bohme, CEO and Founder of PTScientists said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X