వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసు

|
Google Oneindia TeluguNews

తనకు ఎదురొచ్చిన లేదా ప్రశ్నించిన అందరిపైనా నోరేసుకుని పడిపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలవాటు. ఈ విషయంలో తాను కూడా తక్కువేం కాదని నిరూపించుకున్నారు ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా భర్తతో కలిసి ఆమె శుక్రవారం ఫ్లోరిడాలో పర్యటించారు. అక్కడి సభను ఉద్దేశించి మాట్లడుతూ మెలానియా సంచలన వ్యాఖ్యలు చేశారు..

ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..

భర్తతో కలిసి తొలిసారి..

భర్తతో కలిసి తొలిసారి..

అమెరికాలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండటంతో రిపబ్లికన్, డెమోక్రటిక్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కరోనా సోకడంతో ఎన్నికల ప్రచారానికి దూరమైపోయిన ఫస్ట్ లేడీ మెలానియా రోగం నయం కావడంతో మళ్లీ రంగంలోకి దిగారు. తన రెండో ప్రచార సభలోనే భర్త డొనాల్డ్ తో కలిసి పాల్గొన్నారు. శుక్రవారం ఫ్లోరిడాలో రిపబ్లికన్లు నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. బెటర్ అమెరికా కోసం నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో తన భర్తకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో..

మీడియాపై విసుర్లు..

మీడియాపై విసుర్లు..

అమెరికన్ మీడియా, టెక్ దిగ్గజాలను ఉద్దేశించి ఫస్ట్ లేడీ మెలానియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కు వ్యతిరేకంగా మీడియా పెద్ద ఎత్తున నెగటివిటీని, భయంకరమైన సందేశాలను ప్రజల్లోకి చొప్పిస్తున్నదని, తప్పుడు వార్తలను ఇళ్లలోకి తీసుకొస్తోంందని ఆరోపించారు. అదే సమయంలో టెక్ దిగ్గజాలైన కొన్ని కంపెనీలు.. రాజకీయాలపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాయని, పొలిటికల్ సెన్సార్షిప్‌కు పాల్పడుతున్నాయని మెలానియా విమర్శించారు.

ట్రంప్ ది గ్రేట్..

ట్రంప్ ది గ్రేట్..

మీడియా, టెక్ కంపెనీలు అబద్దపు ప్రచారాలు చేస్తోన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మనకు ఏది ముఖ్యమో గుర్తుంచుకోవాలని మెలానియా అన్నారు. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ల భవిష్యత్తుపైనే దృష్టిపెట్టిందని, ట్రంప్ నాయకత్వంలో అమెరికా సురక్షితంగా ఉందని, తన నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ‌ను ట్రంప్ పరుగులు పెట్టించారని, చరిత్రలోనే నిరుద్యోగరేటును గణనీయంగా తగ్గించగలిగారని, గడిచిన నాలుగేళ్లలో అమెరికా సైన్యం గతంలో కంటే ఎక్కవ శక్తిమంతంగా తయారైందని మెలానియా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఫస్ట్ లేడీ ఘాటు ప్రసంగం తర్వాత ఆమె ట్రంప్ కు ఏమాత్రం తీసిపోరని, నోటిని వాడటంలో ఇద్దరూ ఇద్దరే అని నెటిజన్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్బీహార్‌లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్‌కు ఆప్షన్ లేదన్న రవిశంకర్

English summary
President Donald Trump is focused on the future of the country and a vote for him is a vote for a better America, First Lady Melania has said as she made an impassioned plea to voters to back her husband during the November 3 presidential polls. Melania was speaking at her second election rally and first joint appearance with Trump in Tampa, Florida on Thursday. Trump, a Republican, is seeking re-election to the White House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X