వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రీన్ కార్డుల జారీపై గరిష్ట పరిమితి ఎత్తివేత..! భారత్ కు శుభవార్త చెప్పిన అమెరికా..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్ : ఇటీవల అమెరికా నుండీ అన్నీ బ్యాడ్ న్యూస్ లే వింటున్న భారత్ కు అగ్రరాజ్యం తాజాగా ఒక పెద్ద గుడ్ న్యూస్ వినిపించింది. గ్రీన్ కార్డుల విషయంలో మనకు, చైనాకు అనుకూలంగా ఉండే నిర్ణయానికి మద్దతు తెలిపింది. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వతంగా స్థిరపడటానికి ఉద్దేశించిన 'గ్రీన్ కార్డు'ల జారీపై గరిష్ట పరిమితిని ఎత్తివేసింది.

అంటే అమెరికాలో ఉద్యోగం వస్తే... భారతీయులు ఉంటారో లేదో అన్న సంశయం ఇక అక్కర్లేదు. అంత కంటే ముందే ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయులకు ఇది నమ్మలేని గుడ్ న్యూస్. ఇంతవరకు ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీచేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని అమెరికా సెనెట్ లో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి సెనెట్ ఆమోదం కూడా తెలిపింది.

Waiver of maximum limit on green card issuance.! America told good news for India..!!

ఈ బిల్లు ప్రకారం ఇకపై ప్రతిభ ఆధారంగానే విదేశీయులకు గ్రీన్ కార్డులు జారీచేస్తారు. ప్రస్తుతం అమెరికాలో పెద్దసంఖ్యలో గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పాత నిబంధన ప్రకారం భారతీయుల గ్రీన్ కార్డు దరఖాస్తులు ఆమోదం పొందాలంటే 70 ఏళ్లు పడుతుందని అంచనాలున్నాయి. తాజా బిల్లు ఆమోదంతో దరఖాస్తులు పెట్టుకున్న వారి కలలన్నీ నెరవేరనున్నాయి. పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలిపోతున్న మన లాంటి దేశాలకు ఇది పెద్ద గుడ్ న్యూస్.

అంతేకాదు... ఇందులో మరో మంచి వార్త కూడా ఉంది. 'ఫ్యామిలీ స్పాన్సర్డ్‌' విభాగంలో కూడా కోటాను 15 శాతానికి పెంచాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికాలోని సంస్థలు హెచ్‌-1బి వీసాల ద్వారానే విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసాలపై పనిచేసేవారిలో భారతీయులే అత్యధికం. తాజా అమెరికా నిర్ణయంతో భారతీయులు పెద్ద యెత్తున ఊపిరి పీల్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

English summary
Recently, a major good news has been heard by India, who have been listening to all the bad news from America. In the case of green cards, we support the decision in favor of China and India. It has lifted the maximum limit on the issuance of green card cards for foreign professionals to settle in the US permanently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X