వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడిచే చేప, తుమ్మే కోతి: హిమాలయాల్లో కొత్తజాతులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: ప్రపంచ ప్రకృతి సంపద పరిరక్షణ సంస్థ ఇటీవలి కాలంలో హిమాలయాల్లో 200కు పైగా రకాల కొత్త జంతు, వృక్ష జాతులను కనుగొంది. వర్షం వచ్చినప్పుడు తుమ్మే కోతి, నడిచే చేప.. తదితర ఎన్నో కొత్త జాతులను గుర్తించింది.

వీటిని ఈస్టరన్ హిమాలయ పర్వతాల్లో ఇటీవలి సంవత్సరాల్లో గుర్తించారు. సంస్థకు సంబంధించిన సభ్యులు భూటాన్, నార్త్ ఈస్ట్ ఇండియా, నేపాల్, నార్త్ మయన్మార్, సదర్న్ టిబెట్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పర్యావరణ ప్రమాద ప్రాంతాల్లో జాగృతం చేస్తున్నారు.

ఇందులో భాగంగా వారు పర్యటించారు. 2010లో సంబంధిత సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు నార్తర్న్ మయన్మార్ ప్రాంతంలో నలుపు, తెలుపు కోతిని గుర్తించారు. అది వర్షం వచ్చినప్పుడు భిన్నంగా ప్రవర్తించడాన్ని వారు గుర్తించారు.

Walking fish, sneezing monkey discovered in Himalayas

నీలంతో పాటు రంగుల్లో కలుస్తున్న నడిచే చేపను గుర్తించారు. ఈ నడిచే చేప తల పాములా ఉంటుంది. ఈ చేప భూమి పైన నాలుగు రోజుల వరకు బతికి ఉంటుంది. గాలిని పీల్చుకొని బతకగల్గుతుంది. అంతేకాదు, ఇది నాలుగు వందల మీటర్ల వరకు భూమి మీద జారుకుంటు వెళ్లగలదు.

వీరు మరెన్నింటినో గుర్తించారు. 2009 నుంచి 2014 మధ్య 211 రకాల కొత్త జాతులను గుర్తించారు. ఇందులో 133 మొక్క రకాలు, ఆర్కిడ్స్, 26 రకాల చేపలు, 10 రకాల ఉభయచరాలు, 39 రకాల అకశేరుకాలు, ఒక సరీసృప జాతి, ఒక పక్షి జాతి, ఒక క్షీరజాతి రకాన్ని గుర్తించారు.

English summary
A conservation group the World Wide Fund for Nature (WWF) says that a monkey that sneezes when it rains and a "walking" fish are among more than 200 species discovered in the fragile eastern Himalayas in recent years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X