వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

269 స్టోర్ల మూసివేత: రోడ్డున పడనున్న 16వేల మంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ స్టోర్స్ తాజా ప్రకటనతో ఆ కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 269 వాల్‌మార్ట్ స్టోర్స్‌ను మూసివేయాలని భావిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆ కంపెనీ పేర్కొంది. ఈ నిర్ణయంతో సుమారు 16,000 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.

ఇందులో 6,000 మంది ఉద్యోగులు విదేశీ సిబ్బంది కావడం విశేషం. అమెరికాలోని 154 స్టోర్స్, విదేశాల్లోని 115 స్టోర్లను మూసివేయాలని వాల్‌మార్ట్ సీఈఓ నిర్ణయం తీసుకున్నారు. బ్రెజిల్‌లో ఇప్పటికే 60 వాల్‌మార్ట్ స్టోర్స్‌ను మూసివేశారు. అంతేకాదా బ్రెజిల్‌లో దేశ వ్యాప్తంగా వాల్‌మార్ట్ స్టోర్ల ఆదాయం 5 శాతం పడిపోయిందని పేర్కొన్నారు.

Walmart to close 269 stores, lay off 16,000 employees

సాధ్యమైనంత వరకు వాల్‌మార్ట్ ఉద్యోగులను తమ అనుబంధ సంస్థల్లోకి బదిలీ చేశారు. జనవరి చివరికల్లా ఈ తతంగం పూర్తవుతుందని వాల్ మార్ట్ సీఈఓ డౌగ్ మెక్ మిలన్ పేర్కొన్నారు. లాటిన్ అమెరికాలోని వాల్‌మార్ట్ స్టోర్స్ ప్రస్తుతం అంత లాభదాయకంగా పని చేయడం లేదు.

దీంతో ఆయా స్టోర్లను మూసివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. పెద్ద గిడ్డంగి దుకాణాలు మరియు శివారు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా 405 స్టోర్స్ ప్రారంభించాలని వెల్లడించింది.

English summary
Retail giant Walmart Stores, Inc. on Friday announced plans to close 269 stores and lay off 16,000 employees, including 6,000 of them outside the U.S.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X