వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో అనుకుంటే.. విలన్ అవతారం బయటపడింది.. నేరం రుజువైతే 40 ఏళ్లు జైలు శిక్ష!

హీరో కాస్తా జీరో అవడం అంటే ఇదేనేమో. సైబర్ అటాక్ నుంచి ప్రపంచాన్నే కాపాడి అందరి మనసుల్ని గెలుచుకొని హీరో అనిపించుకున్న వ్యక్తి.. పూర్వాశ్రమంలో పెద్ద విలన్ అన్న విషయం తాజాగా బయటకు రావటం సంచలనంగా మారింది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: హీరో కాస్తా జీరో అవడం అంటే ఇదేనేమో. సైబర్ అటాక్ నుంచి ప్రపంచాన్నే కాపాడి అందరి మనసుల్ని గెలుచుకొని హీరో అనిపించుకున్న వ్యక్తి.. పూర్వాశ్రమంలో పెద్ద విలన్ అన్న విషయం తాజాగా బయటకు రావటం సంచలనంగా మారింది.

కొద్ది నెలల క్రితం ప్రపంచం మొత్తాన్ని వణికించిన 'వాన్నాక్రై' సైబర్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న వ్యక్తిగా మార్కస్ హచిన్స్ పేరు మారుమోగింది. ప్రపంచ దేశాల్ని వణికించిన ఈ వైరస్ కు చెక్ పెట్టేలా ఈ మాల్ వేర్ నిపుణుడు చేసిన సాయాన్ని ఎవరూ మర్చిపోలేరు.

రెండు నెలల క్రితమే హీరోగా...

రెండు నెలల క్రితమే హీరోగా...

‘వాన్నాక్రై' దెబ్బకు మొరాయించిన సిస్టమ్స్ ను తిరిగి పని చేసేలా చేయటంలో మార్కస్ కృషిని ఎవరూ తక్కువ చేయలేరు. 22 ఏళ్ల వయసున్న ఇతగాడు రెండు నెలల క్రితమే ప్రపంచ హీరోగా సైబర్ ప్రపంచంలో గుర్తింపు పొందారు. అలాంటి అతడ్ని తాజాగా అమెరికా పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. అయితే.. ఆయన్ను అరెస్ట్ చేయటానికి సముచితమైన కారణం లేకపోలేదు.

గతంలో వైరస్ సృష్టి కర్తగా...

గతంలో వైరస్ సృష్టి కర్తగా...

వాన్నాక్రై వైరస్ కు చెక్ పెట్టి ప్రపంచాన్ని రక్షించిన మార్కస్ గతంలో తనకు తానే ఒక వైరస్ ను సృష్టించిన పాత నేరం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘క్రోనోస్ బ్యాకింగ్ ట్రోజన్' అనే పేరున్న వైరస్ ను ఇతడు తన స్నేహితుడితో కలిసి 2014-15 మధ్య కాలంలో తయారు చేసినట్లు గుర్తించారు.

అమ్మి సొమ్ము చేసుకున్నాడు...

అమ్మి సొమ్ము చేసుకున్నాడు...

ఈ మాల్ వేర్ ను వెబ్ బ్రౌజర్లకు పంపంటం ద్వారా బ్యాంకు ఖాతాల పాస్ వర్డ్.. యూజర్ నేమ్ లను ఇది రికార్డు చేస్తుంది. ఈ మాల్ వేర్ ను తయారు చేసి.. దాన్ని అమ్మిన హాచిన్స్ భారీగా లాభపడ్డాడు. ఈ మాల్ వేర్ కు సంబంధించిన కేసు ఒకటి అప్పట్లో విస్కన్సిన్ ఫెడరల్ కోర్టులో నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

లాస్ వేగాస్ లో అరదండాలు...

లాస్ వేగాస్ లో అరదండాలు...

దీంతో మార్కస్ హచిన్స్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బ్రిటన్ లోని హ్యాకర్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురూస్ వార్షిక సదస్సుకు హాజరై.. తిరిగి వస్తున్న వేళ లాస్ వేగాస్ లో మార్కస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడ్ని కోర్టులో హాజరుపర్చారు.

బెయిల్‌పై విడుద‌లైనా...

బెయిల్‌పై విడుద‌లైనా...

బ్యాంకింగ్ మాల్‌వేర్‌ని త‌యారు చేసి, అమ్మ‌కాలు చేప‌ట్టిన కార‌ణంగా అరెస్టైన `వాన్నాక్రై` కిల్‌స్విచ్ హ్యాక‌ర్ మార్క‌స్ హాచిన్స్ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. బ్రిట‌న్ వ‌దిలి వెళ్ల‌కుండా ఉంటూ, 40000 డాల‌ర్లు చెల్లిస్తే మార్క‌స్‌కు బెయిల్ మంజూరు అయింది. ఆగ‌స్టు 8న అత‌ని కేసు విచార‌ణ మొద‌ల‌వుతుంది.

గ‌రిష్టంగా 40 ఏళ్లు జైలు శిక్ష...

గ‌రిష్టంగా 40 ఏళ్లు జైలు శిక్ష...

ఒక‌వేళ మార్క‌స్‌పై ఆరోప‌ణ‌లు రుజువైతే బ్రిట‌న్ న్యాయ‌ చ‌ట్టాల ప్ర‌కారం అత‌నికి గ‌రిష్టంగా 40 ఏళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. అత‌నిపై ఆరోప‌ణ‌ల్లో పెద్ద‌గా బ‌లం లేక‌పోవ‌డంతో స‌రైన డిఫెన్స్ ఉంటే శిక్ష‌ను త‌గ్గించే అవ‌కాశాలున్నాయ‌ని ఎల‌క్ట్రానిక్ ఫ్రంటియ‌ర్ ఫౌండేష‌న్ అనే స్వ‌చ్ఛంద సంస్థ చెబుతోంది.

‘హీరోను ఇలా ట్రీట్ చేస్తారా?’

‘హీరోను ఇలా ట్రీట్ చేస్తారా?’

త‌మ స్వ‌చ్ఛంద సంస్థ త‌ర‌ఫున మంచి డిఫెన్స్ లాయ‌ర్ కూడా మార్క‌స్ కోసం అందుబాటులో ఉంచుతామ‌ని కూడా ఎల‌క్ట్రానిక్ ఫ్రంటియ‌ర్ ఫౌండేష‌న్ పేర్కొంది. ప్ర‌పంచ దేశాల‌ను `వాన్నాక్రై` వంటి ప్ర‌మాద‌క‌ర‌ ర్యాన్స‌మ్‌వేర్ నుంచి కాపాడిన హీరోను ఇలా ట్రీట్ చేయ‌డం స‌బబుగా లేద‌ని ఆ సంస్థ అభిప్రాయ‌ప‌డింది.

English summary
When the WannaCry cyber attack had unfolded, there was chaos in many countries but one cyber-expert named Marcus Hutchins was hailed as a hero. Hutchins managed to find a kill switch for the dreaded cyber attack. But now Hutchins has been arrested by the FBI for his role in creating and spreading a malware named Kronos, which was used to attack banking websites. So what has happened in this case? Hutchins had risen to fame in May 2017 after he helped stop the WannaCry cyber attack, which crippled the National Health Services (NHS) in the UK and many other enterprises, governments across the world. Others on the list included: FedEx, Nissan Motor company, Renault. India too was impacted by the ransomware attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X