వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక్కడే ఎక్కువ పని.. ఇక ఫోకస్ దానిపైనే; ఆ విషయం పాక్‌కు తెలియకపోవచ్చు: ఒబామా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Barack Obama Interact With Young Leaders, Watch

న్యూఢిల్లీ: భారతీయ ముస్లింలు మొదట తాము భారతీయులమనే భావిస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. భారత పర్యటనలో ఉన్న ఒబామా శుక్రవారం హిందుస్తాన్‌ టైమ్స్‌ నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు.

అనంతరం ఒబామా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ పలు ఆసక్తికర అంశాలపై ప్రసంగించారు. ఆ తర్వాత ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముస్లింల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం.

మోడీతో ఇలా:

మోడీతో ఇలా:

ఇతర దేశాలకు భిన్నంగా భారత్‌లో ముస్లిం వర్గం ఎన్నో విజయాలు సాధించిందన్నారు ఒబామా. తమను తాము భారతీయులుగా పరిగణిస్తూ ఈ దేశంలో అంతర్భాగంగా ఉందని గుర్తుచేశారు.

గతంలో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంలో మోడీతో మాట్లాడిన విషయాల గురించి చెప్పారు. ఓ దేశం మత ప్రాతిపదికన విడిపోవొద్దని, ఇదే విషయాన్ని మోదీకి, అమెరికా ప్రజలకు చెప్పానని గుర్తుచేశారు.

అయితే ఆ సమయంలో మోడీ ఎలా స్పందించారన్న దానికి మాత్రం ఒబామా సమాధానం చెప్పలేదు. ఆ వ్యక్తిగత సంభాషణలను వెల్లడించడం తనకిష్టం లేదన్నారు. అంతేకాదు, మత సామరస్యం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా భారత్ ను ఉద్దేశించినవి కావని, అమెరికా, యూరోప్‌ల్లోనూ పలు సందర్భాల్లో ఇవే విషయాలను చెప్పానని వివరణ ఇచ్చారు.

 అవి ముఖ్యం కాదు:

అవి ముఖ్యం కాదు:

ఒబామా ఫౌండేషన్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రధాని కార్యాలయమో, అధ్యక్షుడి కార్యాలయమో ముఖ్యమైనవి కావని ఒబామా స్పష్టం చేశారు. తనకు నచ్చిన సిద్దాంతానికి మద్దతు తెలిపి దాన్ని ప్రోత్సహించే పౌరుడే ప్రజాస్వామ్యంలో కీలకం అని తెలిపారు. నాయకుల నిర్ణయాలు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు.. అది సరైందో కాదో ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత పౌరుడిపై ఉంటుందన్నారు.

 ఆ విషయం పాక్‌కు తెలియకపోవచ్చు:

ఆ విషయం పాక్‌కు తెలియకపోవచ్చు:

పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న ప్రశ్నకు ఒబామా ఆసక్తికర సమాధానం చెప్పారు. 'ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలోనే ఉంటున్నట్లు పాకిస్థాన్‌కు తెలియదు. ఆ విషయంలో మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ, మేం కచ్చితంగా పరిశీలించాల్సిన విషయమది. ఇక నేను చెప్పినదానిపై మీరే లోతుగా ఆలోచించుకోండి' అని ఒబామా స్పష్టం చేశారు.

ఇక ఫోకస్ దానిపైనే.. ఇక్కడే ఎక్కువ పని:

ఇక ఫోకస్ దానిపైనే.. ఇక్కడే ఎక్కువ పని:

21వ శతాబ్దపు భాగస్వామ్యాన్ని నిర్ణయించేది భారత్‌-అమెరికాల సంబంధాలే అని ఒబామా పేర్కొనడం గమనార్హం. ఒక్క అమెరికాకే పరిమితం అవకుండా ప్రపంచవ్యాప్తంగా యువ నాయకులకు శిక్షణ ఇవ్వడంపైనే ఇకనుంచి తన ఫోకస్ ఉంటుందన్నారు.

అంతేకాదు, యువత ఎక్కువగా ఉన్న భారత్‌లోనే తనకు ఎక్కువ పని ఉంటుందని అనడం గమనార్హం. ఒబామా ఫౌండేషన్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 300మంది యంగ్ లీడర్స్ పాల్గొన్నారు.
బరాక్‌ ఒబామాను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా కలిశారు. ఒబామాను మరోసారి కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు.

English summary
Former US President Barack Obama arrived at the Delhi Town Hall to interact with young leaders from across India for Obama Foundation on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X