వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రీమ్ జాబ్స్ అంటే ఇవే..: నిద్రపోతే చాలు రూ.11లక్షలు ఇస్తారట!

ఏ ఉద్యోగమైనా తమకు కావాల్సిన పనిని చేస్తేనే ఉద్యోగస్తులకు జీతం ఇస్తాయి కంపెనీలు, సంస్థలు. ఉద్యోగస్తులు, కార్మికులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కానీ, వారికి సరైన జీతాలు, ప్రమోషన్లు అందవు. కానీ, ఇక్కడ మా

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఏ ఉద్యోగమైనా తమకు కావాల్సిన పనిని చేస్తేనే ఉద్యోగస్తులకు జీతం ఇస్తాయి కంపెనీలు, సంస్థలు. ఉద్యోగస్తులు, కార్మికులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కానీ, వారికి సరైన జీతాలు, ప్రమోషన్లు అందవు. కానీ, ఇక్కడ మాత్రం నిద్రపోతే చాలు.. జీతమిస్తామంటున్నారు. ప్రపంచంలో ఇంతకన్నా మంచి ఉద్యోగం ఉంటుందా చెప్పండి! అందుకే త్వరపడండి.

వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్సిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ మెడిసిన్ అండ్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా నిద్రపోయే వారి కోసం వెదుకుతున్నారు. ఈ ఉద్యోగం పొందినవారు మూడు నెలలు నిద్రపోవాల్సి ఉంటుంది. ఇలా నిద్రపోయినందుకుగాను 16 వేల యూరోలు (దాదాపు 11 లక్షల రూపాయలు) చెల్లించనున్నారు.

Wanted: space volunteers willing to lie in bed for two months – for €16,000

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భార రహిత స్థితిలో పునరుత్పత్తి‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో భాగంగా మూడు నెలలపాటు నిద్రించే వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఈ జాబ్ కోసం వచ్చేవారు పరిశోధన కోసం మూడు నెలల పాటు నిద్రపోవాలి. ఇందులో మూడు దశలు ఉంటాయి.

మొదటి రెండు వారాలు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 60 రోజులు నిద్రపోవాల్సి ఉంటుంది. తర్వాత తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు రెండు వారాలు పునరావాస కేంద్రానికి పంపిస్తారు. అయితే ఈ ఉద్యోగం చూడడానికి సులభంగా కనిపించినా నిబంధనలు మాత్రం కఠినంగానే ఉన్నాయి.

మొదటి నిబంధన ఏంటంటే.. తలను కిందికి ఆరు డిగ్రీల కోణంలో వంచి నిద్రపోవాలి. అలాగే నిద్రపోయే సమయంలో ఒక భుజం ఎప్పుడూ మంచాన్ని ఆనుకుని ఉండాలి. ఈ 60 రోజులు తినడం, పడుకోవడం, వాషింగ్ వంటి నిత్యకృత్యాలు సాధారణమే. ఉద్యోగాన్ని ఆశించే పురుషులు 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. దీంతోపాటు పూర్తి ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది.

English summary
young, fit and healthy men willing to lie on their backs and do absolutely nothing for two months. Wage: €16,000. Researchers at France’s space medical institute are advertising for what could be, quite literally, a dream job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X