వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు..! ఉ.కొరియాను వెనకేసుకొచ్చిన ట్రంప్‌..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మరో యుద్దం రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ఆర్లింగ్టన్‌ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది. 'పేట్రియాట్‌' గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు, బలగాలపై దాడికి ఇరాన్‌ పూర్తి సన్నద్ధతతో ఉందన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే మోహరించిన యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ యుద్ధనౌక, బీ-52 బాంబర్‌ విమానాలకు ఇవి జతకలవనున్నాయి.

War between the US and Iran.! trump applaus N.korea..!!

ఇరాన్‌తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదనీ, కానీ తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణశాఖ స్పష్టం చేసింది.ఉ.కొరియా స్వల్పశ్రేణి క్షిపణులనే పరీక్షించింది. అవి సాధారణమైన పరీక్షలు. క్షిపణి పరీక్షలు విశ్వాసఘాతుకమని నేను అనుకోవట్లేను. ఉ.కొరియా అధినేత కిమ్‌తో నాకు సత్సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. గతేడాది జూన్‌లో ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో అన్నిరకాల అణు, ఖండాంతర క్షిపణి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కిమ్‌ ప్రకటించారు. ఫిబ్రవరిలో ట్రంప్‌తో రెండో విడత చర్చలు విఫలం కావడంతో ఈ ఏడాది చివర్లోగా పద్ధతిని మార్చుకోవాలని అమెరికాను కిమ్‌ హెచ్చరించారు.

English summary
War ships between America and Iran are moving ahead. The US, which recently imposed a number of restrictions on Iran, announced that the latest aircraft carrier US Arlington was stationed in the West Asian seas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X