వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా రాక: తీవ్రవాదంపై హామీ వచ్చేనా, ప్రకటన ఆ హాస్యాస్పదమా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా భారత్ రానున్న నేపథ్యంలో చాలామంది చాలా అంచనాలు వేస్తుండవచ్చు. ఆర్థిక సంబంధాలు, రక్షణకు సంబంధించిన ఒప్పందాలు తదితరాలకు అమెరికా - భారత్ చర్చల్లో ప్రాధాన్యత ఉండే అవకాశముంది. అయితే, తీవ్రవాదం పట్ల అమెరికా నిబద్దత పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

భారతదేశం ఎన్నో ఏళ్లుగా తీవ్రవాదంతో పోరాడుతోంది. అంతర్జాతీయంగా పుట్టుకు వస్తున్న తీవ్రవాద సంస్థలు భారత్‌లో అడుగిడేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటి గురించి భారత్ - అమెరికాల మధ్య చర్చ జరగాలని భావిస్తున్నారు. ఇటీవల ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో వార పత్రిక పైన తీవ్రవాదుల దాడిని ఇస్లామిక్ టెర్రర్‌గా ఒబామా గుర్తించలేదు.

స్టేట్ ఆఫ్ ది యూనియన్‌లో ఒబామా మాట్లాడుతూ.. చార్లీ హెబ్డో పత్రిక పైన దాడిని ఇస్లామిక్ టెర్రర్ గుర్తించలేదని, తద్వారా భారత దేశానికి తీవ్రవాదం విషయంలో ఒబామా పరోక్షంగా ఎలాంటి ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయారంటున్నారు. ఒబామా వాస్తవానికి దూరంగా మాట్లాడారని అమెరికా మీడియానే ఘోషించింది.

War on terror: India can expect nothing from Obama

అరబ్ పెనిన్సులాలో అల్ ఖైదా ఓ దుష్టశక్తిలా తయారయిందనే విషయం అందరికీ తెలుసు. చార్లీ హెబ్డో పైన దాడి చేసింది తామేనని అల్ ఖైదా ప్రకటించింది. అల్ ఖైదా చాలా వేగవంతంగా విస్తరిస్తోంది. ఆఫ్రికా, యూరోప్‌లలో వేగంగా విస్తరిస్తోంది. తీవ్రవాదం భారతదేశానికి పెద్ద ఆందోళన కలిగించే అంశం.

స్టేట్ ఆఫ్ యూనియన్‌లో ఒబామా ఒక్కసారి కూడా అల్ ఖైదాను ఉచ్చరించలేదు. 9/11 దాడి తర్వాత ఓ అమెరికా అధ్యక్షుడు అల్ ఖైదా గురించి ఉచ్చరించక పోవడం బహుశా మొదటిసారి కావొచ్చు. యెమన్, లిబియాలలోని సమస్య పైన పోరాటం కోసం గత ఏడాది చూపిన ఆసక్తి.. ఒబామా ఈసారి చూపించలేదంటున్నారు.

స్టేట్ ఆఫ్ యూనియన్ సదస్సులో ఐసిస్ పైన అమెరికా యుద్ధం ప్రకటించింది. అయితే, ఐసిస్‌ను ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు పోతారో తెలియాల్సి ఉంది. అమెరికా ఐసిస్ పైన సోకాల్డ్ యుద్ధం ప్రకటించినందు వల్ల అది మరింత బలంగా తయారయిందని అంటున్నారు.

ఐసిస్ కేవలం ఇరాక్, సిరియాకే కాకుండా ప్రపంచానికి సవాల్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ ఆఫ్ యూనియన్ సదస్సులో బరాక్ ఒబామా లేదా అమెరికా దీని గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంటున్నారు.

సిరియా, ఇరాక్‌లలో ఐసిస్ పైన పోరాటానికి కట్టుబడి ఉన్నామని భారత్‌కు చెందిన పలువురు అధికారులు చెబుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లినప్పుడు ఐసిస్ పైన పోరాటానికి కలిసి రావాలని అమెరికా కోరింది. అయితే, ఐసిస్ పైన పోరాటమనేది పైకి తప్ప ఫలితం కనిపించడం లేదంటున్నారు.

అల్ ఖైదా లేదా ఐసిస్ వంటి సంస్థలు నడవడానికి ఫండ్స్ చాలా అవసరం. వాటికి అవే వెన్నెముక వంటివి. సౌదీ అరేబియా వంటి దేశాలలోని వారి నుండి వాటికి నిధులు అందుతున్నాయని, వాటి పైన అమెరికా పెదవి విప్పడం లేదంటున్నారు.

భారత దేశం కాంటెక్స్‌లో.. సౌదీ అరేబియా నుండి ఫండ్స్ చాలా సమస్యగా మారుతున్నాయి. సౌదీ అరేబియా, భారత దేశాల మధ్య తీవ్రవాదం పైన పోరు విషయంలో పర్సపర సహకారం ఉన్నప్పటికీ అది సమస్యగా మారిందంటున్నారు. అల్ ఖైదా లేదా ఐసిస్ తదితర సంస్థలు సౌదీ అరేబీయా ఫండ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయంటున్నారు.

తీవ్రవాదం విషయంలో బిగ్ బ్రదర్ (అమెరికా) కఠినంగా వ్యవహరించని పక్షంలో.. భారత దేశం కాస్త చేయడం మినహా ఏం చేయలేదంటున్నారు. తీవ్రవాదం విషయంలో పాకిస్తాన్ అంశం భారత్‌కు ఎప్పుడు ఆందోళన కలిగించే అంశం. బరాక్ ఒబామా భారత్‌లో పర్యటించే సమయంలో ఎలాంటి తీవ్రవాద దాడులు జరగవద్దని అమెరికా హెచ్చరించింది.

ఈ హెచ్చరిక చాలా హాస్యాస్పదంగా, ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. ఒబామా భారత్‌ను వీడిన తర్వాత మళ్లీ దాడులు చేసుకోవడం సరైనదేనా అంటున్నారు. పార్లమెంటు పైన దాడికి పాకిస్తాన్ పైన ఆధారాలు చూపించాలని అమెరికా అడిగింది.

హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంల పైన భారత్ ఆందోళన విషయంలలోను అమెరికా ఆధారాలు కోరింది. అయితే, అమెరికా మాత్రం వారిని భారత్‌కు అప్పగించాలని తరుచూ పాకిస్తాన్‌కు చెప్పడం మినహా ఏం చేయలేకపోతోందంటున్నారు.

English summary
President of the United States of America, Barack Obama is all set to visit India and there are plenty of expectations from him. While economic ties and defence deals will form major part of the discussion, there are doubts about the commitment that the US has towards the issue of terrorism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X