వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఆసక్తికరం: మోడీ భార్య కోసం డోర్ తెరిచి..?

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని వైట్ హౌస్‌లో జరిగిన ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని వైట్ హౌస్‌లో జరిగిన ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు వైట్‌హౌస్‌కు చేరుకున్న మోడీకి ట్రంప్‌ దంపతులు స్వాగతం పలికారు.

'ఎన్ ఎస్ జీ లో శాశ్వత సభ్యత్వానికి మద్దతు',' ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు''ఎన్ ఎస్ జీ లో శాశ్వత సభ్యత్వానికి మద్దతు',' ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు'

అనంతరం కేబినెట్‌ రూమ్‌లో ట్రంప్‌- మోడీల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. మోడీ శ్వేత సౌధంకు వచ్చినప్పుడు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఆ తర్వాత..

ఆ తర్వాత..

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత వైట్‌హౌస్‌లో విందు స్వీకరించిన మొదటి విదేశీ నేత నరేంద్ర మోడీ. ఇరుదేశాల స్నేహబంధాన్ని మరింత ముందుకుతీసుకెళ్లే లక్ష్యంతో అమెరికాలో పర్యటించిన మోడీ.. అధ్యక్షుడు ట్రంప్‌తో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ మీడియా సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ.. ట్రంప్‌ కుటుంబంతో విందు ఆరగించేందుకు వైట్‌హౌస్‌ వెళ్లారు. అక్కడ అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌.. మోడీకి సాదరంగా ఆహ్వానం పలికారు.

ఆసక్తికర సంఘటన

ఆసక్తికర సంఘటన

శ్వేత సౌధం వద్ద మెరిన్‌ సెంట్రీ గార్డులు ప్రధాని మోడీ కారు రాగానే తమ సంప్రదాయక విధులు నిర్వహించారు. ఇరువైపులా నిలుచున్న వారు.. మోడీ కారు రాగానే సెల్యూట్‌ చేశారు. ఆ తర్వాత కారు సమీపానికి వెళ్లి అంకెలు లెక్కిస్తూ డోర్లు పట్టుకొని.. కాసేపు నిలుచుకున్నారు. అనంతరం డోర్లు తెరిచేందుకు ప్రయత్నించారు.

మోడీ సతీమణి కోసం..

మోడీ సతీమణి కోసం..

ప్రధాని కారులో కుడివైపు కూర్చున్నారు. సహజంగా ఎడమవైపు నాయకుల సతీమణులు కూర్చుంటారు. కుడివైపు డోర్‌ తీయగానే ప్రధాని మోడీ దిగారు. అటువైపు గార్డు మాత్రం ఎడమ డోర్‌ తీయడానికి కొంతసేపు కష్టపడ్డాడు. ఆ తర్వాత బలవంతంగా డోర్‌ తీశాడు. ఎడమవైపు నుంచి ఎవరు దిగకపోవడంతో అతను కొంత ఆశ్చర్యపోయాడు. టీవీలలో ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు వెంటనే పోస్టులు పెట్టారు. ప్రధాని మోడీ తన భార్యతో కలిసి జీవించడం లేదు. విదేశీ పర్యటనలకు ఆయన ఒంటరిగానే వెళుతారు. ఈ విషయం అమెరికాకు తెలియదా? ఎందుకు ఇలా రెండువైపులా డోర్లు తీసే ఏర్పాట్లు చేశారు? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయమై కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేశారు.

లాంఛనమే కావొచ్చునని...

లాంఛనమే కావొచ్చునని...

అయితే, ఇలా గార్డులు రెండువైపులా డోర్లు తీయడం లాంఛనప్రాయమైన చర్య అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోడీ వైట్‌హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా గార్డులు రెండువైపులా కారు డోర్లు తీసి నిలబడ్డటాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

English summary
This US guard, who was to open the door for Prime Minister Narendra Modi, had some awkward moments when Modi arrived. Was he expecting PM Modi's wife to be with him?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X