• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో కొత్త రాష్ట్రం ఆవిర్భావం: 51వ స్టేట్‌గా: బిడెన్ సర్కార్ సంచలనం: సొంత పార్టీలో

|

వాషింగ్టన్: అమెరకాలో ఎన్ని రాష్ట్రాలు అనే ప్రశ్నకు 50 అనే సమాధానం ఠక్కున దొరుకుతుంది. ఇప్పుడా సంఖ్య మారింది. మరో కొత్త రాష్ట్రం జత చేరింది. అమెరికాలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 51కి చేరింది. దీనికి సంబంధించిన బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ ఆమోదించింది. తీవ్ర ప్రతిఘటనల మధ్య.. ఈ బిల్లు సభ ఆమోదం పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార డెమొక్రటిక్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఆ పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల గవర్నర్లు దీనికి మద్దతు ఇచ్చారు. ఓటింగ్‌ను రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పార్టీ సభ్యులెవరూ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేదు.

51వ రాష్ట్రంగా..

51వ రాష్ట్రంగా..


కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రమే- వాషింగ్టన్ డీసీ (Washington DC). ఇది అమెరికా రాజధాని. వాషింగ్టన్ డీసీని 51వ రాష్ట్రంగా ప్రకటించింది ఆ దేశ అత్యున్నత చట్టసభ. దీనికి సంబంధించిన బిల్లు హఃస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 216 మంది ఓటు వేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ 208 ఓట్లు పడ్డాయి. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏ ఒక్క సభ్యుడు కూడా వాషింగ్టన్ డీసీని రాష్ట్రంగా గుర్తించడానికి అంగీకరించలేదు. రిపబ్లికన్ సభ్యులెవరూ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయలేదు. వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా లేదు. కొలంబియాలో ఇన్నేళ్లుగా కొనసాగుతూ వచ్చింది.

ఏడు లక్షలకు పైగా జనాభా..

ఏడు లక్షలకు పైగా జనాభా..


రాష్ట్ర హోదా లేనందువల్ల వాషింగ్టనియన్స్.. కొన్ని రకాల పన్నులను అధికంగా చెల్లించాల్సి వస్తోందనే వాదన ఉంది. 2011 లెక్కల ప్రకారం.. వాషింగ్టన్ డీసీ పరిధిలో నివసిస్తోన్న జనాభా 6,17,996. ఇప్పుడీ సంఖ్య ఏడు లక్షలకు దాటి ఉండొచ్చనే అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. 66 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండే వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్ చాలాకాలం నుంచీ ఉంది. ఎండ్ ద ఫిలిబస్టర్ అనే నినాదంతో వాషింగ్టనియన్స్ సుదీర్ఘకాలం నుంచి పోరాటం సాగిస్తున్నారు. డ్రగ్స్ సంబంధిత నేరాలు ఇక్కడ అధికం. రాష్ట్ర హోదా కల్పించడం వల్ల వాటిని నియంత్రించడానికి వీలవుతుందనేది స్థానికుల అభిప్రాయం.

ఇచ్చిన హామీ ప్రకారం..

ఇచ్చిన హామీ ప్రకారం..

పరిపాలన మరంత సులభతరమౌతుందని అంటుంటారు.ఫెడరల్ ట్యాక్సులు కొంతమేర తగ్గుతాయని అంచనాలు కూడా వ్యక్తమౌతున్నాయి. దీనితోపాటు- హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌ కోసం ప్రతినిధిని ఎన్నుకునే వీలు కూడా ఉంటుంది. రాజధాని కావడం వల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరిని నామినేట్ చేస్తుంటుంది. స్థానికుల డిమాండ్‌ను గౌరవిస్తూ- గత ఏడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ పార్టీ ఈ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. దీనికి అనుగుణంగా యూఎస్ హౌస్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. ఆమోదింపజేసుకుంది.

కరోనా మరణాల్లో టాప్..

కరోనా మరణాల్లో టాప్..


కాగా అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి ఎప్పట్లాగే తన విశ్వరూపాన్ని చూపుతోంది. మూడు కోట్లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. 3,26,69,121 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. 5,84,226 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు. కరోనా వైరస్ అత్యధిక పాజిటివ్ కేసులు.. మరణాలు నమోదైంది అమెరికాలోనే. యాక్టివ్ కేసులు 68,48,237గా నమోదయ్యాయి. కాలిఫోర్నియా-61,308, టెక్సాస్-50,041, న్యూయార్క్-52,090 మంది మరణించారు. అమెరికా తరువాత రెండో స్థానంలో భారత్ కొనసాగుతోంది.

English summary
The House of Representatives voted Thursday on a bill that would admit Washington DC as the 51st state of the United States. The legislation passed along party lines with a vote of 216 (D) to 208 (R) with no Republicans voting in favour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X