వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు నేను అధ్యక్షుడిగా లేను కానీ: రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మోర్కెల్

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: రాఫెల్ డీల్ వ్యవహారంపై ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ స్పందించారు. ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమని, ఇరు దేశాల రక్షణ శాఖల మధ్య డల్ అని, అన్ని నిబంధనలు సవ్యంగానే ఉన్నాయని చెప్పారు. డీల్ జరిగే సమయంలో తాను అధ్యక్షుడిగా లేనని చెప్పారు.

రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందంపై గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది.

Wasnt In Charge When Rafale Deal Was Signed, Says Frances Macron

ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం ఐరాసలో ఉన్న మెక్రాన్ ఓ మీడియా సమావేశంలో దీనిపై మాట్లాడారు. రాఫెల్ ఒప్పందం కోసం భారత్ తరఫున భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థను అంగీకరించాలని భారత ప్రభుత్వం ఎప్పుడైనా ఫ్రాన్సును లేదా ఫ్రాన్స్ ఏరోస్పేస్ కంపెనీ డసోను కోరిందా అని విలేకరులు అడగ్గా.. అది ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమన్నారు. అప్పుడు తాను పదవిలో లేనని చెప్పారు.

అయితే తమ ప్రభుత్వ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, ఈ కాంట్రాక్టు ఇరు దేశాల సైన్యం, రక్షణ రంగాల మధ్య సంకీర్ణ ఒప్పందమని చెప్పారు. 36 యుద్ధ విమానాల సమీకరణకు సుమారు రూ.58వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని ఫ్రాన్సుతో కుదుర్చుకున్నట్లు 2016లో భారత ప్రభుత్వం వెల్లడించింది. అప్పుడు ఫ్రాంకోయిస్ హోలాండే అధికారంలో ఉన్నారు. మెక్రాన్ గత ఏడాది మే నెలలో అధికారంలోకి వచ్చారు.

English summary
French President Emmanuel Macron on Tuesday avoided giving a direct answer on the raging Rafale deal controversy, and said he was not in charge when the multi-billion dollar deal for 36 aircraft was signed between India and France.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X