వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేజింగ్ వీడియో!: విమానం నుంచి సరస్సులోకి చేపల వర్షం, ఎందుకంటే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఉటా: ఉటా డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ షేర్ చేసిన వీడియో ఒకటి వివాదానికి తావిచ్చింది. విమానంలో వేలాది చేపలను తీసుకు వచ్చి ఉటా సరస్సులో వదిలేశారు. విమానం నుంచి చేపలను సరస్సులోకి వదిలారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇది వైరల్ అయింది.

ప్రమాదంలో బ్యాంకాక్: ముంపు ముప్పు, భారీ భవనాలు సహా కారణాలు ఇవేప్రమాదంలో బ్యాంకాక్: ముంపు ముప్పు, భారీ భవనాలు సహా కారణాలు ఇవే

ఈ వీడియోను ఆగస్ట్ 24న పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే ఓ విమానంలో తీసుకు వచ్చిన చేపలను ఆ ప్లేన్‌లో అడుగు భాగంలో ఉన్న రంధ్రం ద్వారా వాటిని సరస్సులోకి వదిలారు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి.

విస్తుపోయేలా చేస్తున్న వీడియో

ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికాలోని ఉటా రాష్ట్రంలో అక్కడి వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ కొండ ప్రాంతంలో ఉన్న చెరువులో వీటిని జార విడిచారు. కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పంపకానికి ఈ పద్ధతి సులభంగా ఉండటంతో అక్కడి అధికారులు కొన్నాళ్లుగా దీనిని అనుసరిస్తున్నారు.

ఎందుకో వివరణ ఇచ్చిన అధికారులు

చేపలను సరస్సులో విడిచేందుకు తాము విమానాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నామనే విషయాన్ని అధికారులు వివరించారు. గతంలో పాల క్యాన్లలో చేపలను వేసి వాటిని గుర్రాల పైకి తరలించి చెరువులలో వేసేవాళ్లు. కానీ అదంతా చాలా సమయం తీసుకునే ప్రక్రియ కావడంతో విమానాన్ని ఆశ్రయించారు.

చేపలు బతికే ఉంటాయంటూ

ఇవన్నీ చిన్న చిన్న చేప పిల్లలు కావడంతో ఎత్తు నుంచి కింద పడినా వాటిలో 95 శాతం బతికి ఉన్నాయని చెబుతున్నారు. సరస్సులో చేపల పునరుద్ధరణకు వారు ఎంచుకున్న పద్ధతి సరికాదని చెప్పడంతో వివరణ ఇచ్చారు. ఉటా రాష్ట్రంలో ఉన్న ఈ సరస్సును సందర్శించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అక్కడ ఫిషింగ్ కూడా చేసే వెసులుబాటు ఉంది. దీంతో చేపల సంఖ్య తగ్గుతోంది. ఈ కారణంగా వారు సరస్సులో చేపలు నీళ్లలోకి వదిలేస్తుంటారు.

నెటిజన్ల స్పందన

ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు స్పందించారు. వెరీ ఇంటరెస్టింగ్ అని ఒకరు, వారు అలా ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మరొకరు.. ఇలా స్పందించారు. నాకు కూడా అలా చేపలను వదిలేందుకు అవకాశం దొరుకుతుందా అని మరో నెటిజన్ స్పందించారు.

English summary
If you happen to be visiting one of Utah's many remote mountain lakes, don't be alarmed if you suddenly see more fish in the sky than in the water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X