వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి వెరైటీగా వెల్‌కమ్: గూగుల్ సీఈఓ(వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీకి స్వాగతం పలికేందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ యూట్యూబ్ మాధ్యమాన్ని ఎంచుకున్నారు. ప్రధాని మోడీకి తాము స్వాగతం చెబుతున్నామని, ఆయన్ని కలవాలని తనతోపాటు గూగుల్ కంపెనీ ఉద్యోగులకు ఎంతో ఆతృతగా ఉందని ఆ యూట్యాబ్ వీడియోలో పేర్కొన్నారు.

భారతీయుల్లో ప్రతిభ ఎక్కువ అని, వారి ప్రతిభను టెక్నాలజీ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీకి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Watch: Google CEO Sundar Pichai welcomes PM Narendra Modi

భారత్, సిలికాన్ వ్యాలీల మధ్య బంధం ఎంతో ధృడమైందని పిచాయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లోని ఐఐటీ, ఉన్నత విద్యాసంస్ధల్లో విద్యను అభ్యసించిన వారు ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.

తన వారం రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సిలికాన్ వ్యాలీని సందర్శించనున్నారు. ఫేస్‌బుక్ చీఫ్ జూకర్‌బర్గ్‌తో పాటు అక్కడి 50 కంపెనీలకు పైగా సీఈఓలతో ప్రధాని భేటీ కానున్నారు. అనంతరం అమెరికాలోని భారతీయులు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారు.

English summary
Google CEO Sundar Pichai took to YouTube to welcome Prime Minister Narendra Modi to Silicon Valley. The India-born Google CEO Pichai said, "There is tremendous excitement among Googlers, Indians in US for PM Modi's visit."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X