• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Video: మెరినెల్లి బెండ్.. ప్రపంచంలోనే అత్యంత డేంజర్ ఫీట్.. చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం...

|

'మెరినెల్లి బెండ్...' అత్యంత అసాధారణమైన,ప్రమాదకరమైన శరీర భంగిమ. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోవడం ఖాయం. ఈ ఫీట్‌ను చూడాలంటేనే చాలామందికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది దీన్ని ప్రాక్టీస్ చేయడమన్నా... ప్రదర్శించడమన్నా ప్రాణాలకు తెగించడమే.ప్రపంచంలో ఇప్పటివరకూ అతికొద్ది మంది మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. తాజాగా కెనడాకు చెందిన అనస్తసియా బెగన్ అనే మహిళ విజయవంతంగా ఈ ఫీట్‌ను సాధించింది. 36 సెకన్ల పాటు 'మెరినెల్లీ బెండ్' ఫీట్‌ను ప్రదర్శించగలిగింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

అసలేంటీ 'మెరినెల్లి బెండ్...'

అసలేంటీ 'మెరినెల్లి బెండ్...'

'మెరినెల్లి బెండ్...' ఫీట్ అంటే కేవలం ఒక చిన్నపాటి పోల్‌ను ఆధారంగా చేసుకుని మొత్తం శరీరాన్ని తలమీదుగా ముందుకు వంచే భంగిమ. ఆ పోల్ చివరన ఉండే లెదర్‌ను నోటిలోని పళ్ల మధ్య అదిమిపట్టి... మొత్తం శరీర బరువును నోటిపైనే కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఆపై శరీరం మొత్తాన్ని తల మీదుగా ముందుకు వంచుతూ నేలపై ఉన్న చేతులను వదిలేయాలి. కేవలం నోట్లో పెట్టుకున్న ఆ పోల్‌పైనే శరీర బరువు మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలి.అత్యంత సాహసోపేతమైన,ప్రమాదకరమైన ఈ భంగిమలో ఏమాత్రం నియంత్రణ కోల్పోయినా మెడలు విరిగిపోవడం లేదా ఆ పోల్ నోటిని చీల్చుకెళ్లడం ఖాయం

కెనడాకు చెందిన అనస్తసియా...

కెనడాకు చెందిన అనస్తసియా...

కెనడాకు చెందిన అనస్తసియా బెగన్(28) తాను ఈ ఫీట్ చేస్తానని చెప్పగానే ఆమె తల్లిదండ్రులు,భర్త,బంధువులు బెదిరిపోయారు. వద్దని ఆమెను వారించారు. కానీ అనస్తసియా మాత్రం తాను చేయగలనని... ఆ సత్తా తనలో ఉందని విశ్వసించింది. కేవలం కొద్దిరోజుల ప్రాక్టీస్‌తోనే ఎట్టకేవలకు విజయవంతంగా ఈ ఫీట్ సాధించగలింది. 36 సెకన్ల పాటు అనస్తసియా ఈ ఫీట్ చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ... 'ఇది ప్రాణాలను రిస్క్‌లో పెట్టే ఫీట్. ఏమాత్రం అటు ఇటు అయినా ప్రాణాలకే ప్రమాదం. చాలాసార్లు మెడకు,వెన్నుపూసకు గాయాలవుతుంటాయి. ఈ ఫీట్ చేసేందుకు ప్రయత్నించి చనిపోయినవాళ్లు కూడా ఉన్నారు. ఈ విషయం నా కోచ్ నా భర్తకు చెప్పగానే ఆయన హడలిపోయాడు.' అని చెప్పుకొచ్చారు.

ఎట్టకేలకు విజయవంతంగా...

ఎట్టకేలకు విజయవంతంగా...

'మెరినెల్లి బెండ్ కోసం కేవలం మూడు క్లాసులు మాత్రమే హాజరయ్యాను. అప్పటికీ ఈ ఫీట్‌లో శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. అయినప్పటికీ చాలా నమ్మకంగానే ఉన్నాను. సేఫ్‌గానే ఈ ఫీట్‌ను ప్రయత్నించి... సేఫ్‌గా,విజయవంతంగా ముగిస్తానని అనుకున్నాను. అలా ఏడోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో... ఎట్టకేలకు మెరినెల్లి బెండ్ విజయవంతంగా చేయగలిగాను. 36 సెకన్ల పాటు చేతులను గాల్లోనే ఉంచి... మొత్తం శరీరాన్ని ఆ పోల్‌పై బ్యాలెన్స్ చేయగలిగాను.' అని చెప్పారు.

వైరల్‌గా మారిన వీడియో....

ప్రస్తుతం ఈ ఫీట్‌లో ప్రపంచ రికార్డు 4 నిమిషఆల 36 సెకన్లుగా ఉంది. అంత సమయం పాటు ఈ ఫీట్ చేయడమనేది అత్యంత అసాధారణ,అరుదైన విషయమనే చెప్పాలి. 36 సెకన్ల పాటు ఈ ఫీట్‌ చేసినందుకు చాలా సంతోషిస్తున్నానని అనస్తసియా తెలిపారు. శరీరాన్ని బెండ్ చేయడం ఐదేళ్ల వయసులోనే తాను ప్రాక్టీస్ చేశానని... అయితే ఆ తర్వాత 17 ఏళ్ల వరకూ మళ్లీ ఆ దిశగా సాధన చేయలేదని చెప్పారు. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. చాలామంది ఆ వీడియోను చూసి షాక్‌కి గురవుతున్నారు.

English summary
A woman who is known for bending her body in all sorts of unnatural positions makes her family and friends "sick to their stomachs". Anastasia Evsigneeva, who is originally from Russia and now lives with her husband in Canada, has opened up about her passion for contortions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X