వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెటవుట్: నాడు చైనా ఆర్మీకి భారత సైన్యం

భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 1962 తర్వాత మళ్లీ తొలిసారి ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 1962 తర్వాత మళ్లీ తొలిసారి ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చదవండి: 'భారత్-చైనా మధ్య యుద్ధం వస్తే ఏమవుతుందంటే..'

సిక్కిం-టిబెటన్-భూటాన్ ట్రై జంక్షన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి చైనా, భారత్‌లు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇరు దేశాల సైన్యం మధ్య వాగ్యుద్ధం కూడా సాగుతోంది.

watch-indian-soldiers-telling-chinese-get-out

ఇరు దేశాలకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని (గెట్ అవుట్) చైనా సైనికులకు ఇండియన్ ఆర్మీ చెబుతున్నట్లుగా అందులో ఉంది. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదు. ఇది మూడేళ్ల క్రితం వీడియో. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇది వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా, జి20 సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కరచాలనం చేసుకున్నారు. పరస్పరం ప్రశంసలు కురిపించుకున్న విషయం తెలిసిందే.

చదవండి: మీతో చర్చలా, ఎవరు అడిగారు?: చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్

సదస్సు సందర్భంగా మోడీ, జీ జిన్‌పింగ్‌లు ఎదురుపడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి మాట్లాడుకోలేదు కానీ.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. తొలుత మాట్లాడిన ప్రధాని మోడీ... చైనా నాయకత్వంలో బ్రిక్స్‌ నిర్వహణను అభినందించారు.

ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై భారత్‌ పోరును ప్రశంసించారు. అంతేగాక.. ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని మెచ్చుకున్నారు. మున్ముందు కూడా మరింత వృద్ధి సాధించాలన్నారు. సమావేశం అనంతరం ఇరుదేశాధినేతలు కరచాలనం చేసుకొని కాసేపు ముచ్చటించుకున్నారు.

English summary
Both India and China are at logger heads in what is being seen as the biggest face off since 1962. Both sides have refused to withdraw troops from the Sikkim-Tibet-Bhutan tri-junction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X