• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్ మరో అనూహ్య చర్య - మహిళపై చిందులు - ప్రశ్నలు ఎదుర్కోలేక పలాయనం - వైరల్ వీడియో

|

కనీసం ఎన్నికల సమయంలోనైనా జనం ముందు కాస్త ఒదిగినట్లు నటించడం నేతల ఆనవాయితీ. కానీ డొనాల్డ్ ట్రంప్ కు ఇవేవీ పట్టవు. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో తనపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా తీరు మాత్రం మారబోదని చెప్పేశాడు. గతంలో కంటే ఎక్కువ దూకుడును ప్రదర్శిస్తోన్న ఆయన తాజాగా మరో అనూహ్య చర్యకు పాల్పడ్డారు.

మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్‌ దృష్టికి

 సోషల్ మీడియానే లేకుంటే..

సోషల్ మీడియానే లేకుంటే..

‘‘ట్రంప్ గారూ.. సోషల్ మీడియాలో మీరు చేసే కామెంట్లు, ప్రస్తావించే పేర్ల వల్ల ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని మీరు అనిపించదా?'' అని జర్నలిస్టు లేస్లీ ప్రశ్నించగా.. ‘‘అస్సలు అనిపించదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కాబట్టే నేను ఇక్కడి వరకు రాగలిగలిగాను. నా భావాలు చెప్పడానికి అదొక మంచి వేదిక. నిజం చెప్పాలంటే మీడియా పెద్ద ఫేక్. సోషల్ మీడియా ద్వారానే నా వాయిస్ అందరికీ చేరుతోంది''అని ట్రంప్ బదులిచ్చారు. ‘‘అదేంటి సార్, మీడియాను పదే పదే ఫేక్ అంటారెందుకు?'' అని లేస్లీ తిరిగి ప్రశ్నించగా.. ‘‘అంతేగామరి, కష్టమైన ప్రశ్నలతో ఇంటర్వ్యూ మొదలు పెడతానని చెప్పావ్.. అన్నీ టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నావ్. ఇలాంటి ప్రశ్నలనే జోబైడెన్ ను అడిగే దమ్ము మీకు లేదు. అతణ్ని సాఫ్ట్ గా ప్రశ్నించి, నాతో మాత్రం ఇలా వ్యవహరిస్తారా?'' అని ట్రంప్ మండిపడ్డారు. ఆ తర్వాత..

 ప్రశ్నలంటే గిట్టవు.. సమాధానాలూ లేవు..

ప్రశ్నలంటే గిట్టవు.. సమాధానాలూ లేవు..

‘‘మీరు ప్రెసిడెంట్ కాబట్టే, ప్రస్తుతం నిర్ణయాధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టే కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నాం. బైడెన్ ను ఎందుకు అడగట్లేదనడం భావ్యంకాదు'' అని జర్నలిస్టు లెస్లీ ఇంకాస్త రెట్టించారు. ఆలోపే.. ‘‘సార్ టైమైపోతోంది.. తర్వాతి ప్రశ్నకు వెళదాం..'అంటూ ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ వారించే ప్రయత్నం చేయడంతో ట్రంప్ ఆగ్రహం నషాళానికెక్కింది. ‘‘ఇక చాల్లే ఇంతటితో ముగిద్దాం'' అంటూ కుర్చీలోనుంచి లేచి రుసరుసా వెళ్లిపోయారు ట్రంప్. ‘‘నిజానికి మీరు విన్నదానికంటే ఆ రోజు పెద్ద తతంగమే జరిగింది. ఎవరైనా తనను ప్రశ్నించడం ట్రంప్ కు అస్సలు నచ్చదని, ఆయన దగ్గర సమాధానాలు కూడా లేవని మరోసారి రుజువైంది'' అని లెస్టీ వ్యాఖ్యానించారు. పలాయనం వీడియో విడుదలైన తర్వాత ట్రంప్.. ‘‘ఫేక్ న్యూస్.. ఫేక్ మీడియా.. ఎంతసేపూ కొవిడ్ కొవిడ్ అని గుండెలు బాదుకొంటోంది.. లూజర్స్..'' అంటూ మరో దుందుడుకు ట్వీట్ వదిలారు.

ప్రశ్నలు ఎదుర్కోలేక..

ప్రశ్నలు ఎదుర్కోలేక..

అమెరికాలో ప్రఖ్యాత ‘సీబీఎస్ నెట్ వర్క్' న్యూస్ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘60 మినిట్స్ ఇంటర్వ్యూ' చాలా పాపులర్. ఆ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించే మహిళా జర్నలిస్టు లేస్లీ స్టాల్ పదునైన ప్రశ్నలతో గెస్టుల నుంచి సమాధానాలు రాబడతారనే పేరుంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ క్యాండిడేట్, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత వారం లెస్లీ ఇంటర్వ్యూకు వెళ్లారు. కానీ ఆమె ప్రశ్నలను ఎదుర్కొలేక మధ్యలోనే పలాయనం చిత్తగించారు ట్రంప్. దీనిపై..

పలయానం వీడియో వైరల్..

ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ లేచి వెళ్లిపోయారన్న వార్త దుమారం రేపింది. ‘‘60 నిమిషాల ఇంటర్వ్యూనే ఎదుర్కోలేక పోయాడు.. ఇతనికి రెండోసారి అధ్యక్ష పదవి కట్టబెడదామా?'' అని మాజీ ప్రెసిడెంట్ ఒబామా సెటైర్లు వేశారు. కాగా, అసలా ఇంటర్వ్యూలో ఏం జరిగింది? పర్టికులర్ గా ఏ ప్రశ్నకు ట్రంప్ ఆగ్రహించారు? అనే సస్పెన్స్ ఆదివారంతో తీరిపోయింది. సీబీఎస్ టీవీ ట్రంప్ ఇంటర్వ్యూతోపాటు ఆయన లేచివెళ్లిపోయిన దృశ్యాలను సైతం విడివిడిగా విడుదల చేయగా.. రెండోదానికే లక్షలకొద్దీ వ్యూస్ రావడం గమనార్హం.

బీజేపీకి వైసీపి డైరెక్షనా? - కన్నా నేను ఒకటే -చంద్రబాబు, జగన్‌ కవలలు -ఇదీ అసలు కథ: సోము వీర్రాజు

English summary
After the “60 Minutes” interview with Donald Trump made headlines last week, American TV network CBS aired the entire segment on Sunday, but a short clip that shows the US President abruptly ending the recording and walking away has been viewed over 4 million times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X