వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:ఇదీ నిజంగా గ్రేటే.. లావా ఎగజిమ్ముతుంటే, పైన రోప్ వాక్..

|
Google Oneindia TeluguNews

రోప్ వాకింగ్ అంటే ధైర్యం కావాలి.. అవును ధైర్యవంతులు మాత్రమే చేస్తారు. మరీ కింద ఏమైనా ఉంటే సాహసమే. అగ్ని పర్వతం కింద రోప్ వాక్ చేయడం అంటే మాములు విషయం కాదు. అవును.. కానీ ఇద్దరు చేసి చూపించారు. ఆ వీడియో చూసి ఔరా అనాల్సిందే. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ వీడియోను చూడండి.

బ్రెజిల్ కు చెందిన రాఫెల్ బ్రీడీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ షూల్జ్ రోప్ వాకింగ్ చేశారు. టాన్నా ద్వీపంలో ఉన్న అగ్ని పర్వతంపై 846 అడుగుల పొడవున, 137 అడుగుల ఎత్తులో ఫీట్ చేశారు. లావా ఎగసి పడుతుండగా.. వారు రోప్ వాకింగ్ చేశారు. ఆ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

rope walk over active volcano by two men. this one guinness record created.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోను చాలా మంది రీ ట్వీట్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు. రిస్క్ తీసుకుని రోప్ వాక్ చేయడం ఎందుకని నెటిజన్ల నుంచి ప్రశ్నలు వేస్తున్నారు. బాగా ధైర్యవంతులేనని మరికొందరు పేర్కొంటున్నారు.
ఇంతకు ముందు రాఫెల్ బ్రీడీ అంతరిక్షంలో ఎగురుతున్న రెండు హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య 6,236 అడుగుల ఎత్తులో కట్టిన తాడుపై రోప్ వాక్ చేసి రికార్డు సృష్టించాడు.బ్రెజిల్ లోని శాంటా కాటరినాలో ఆ ఫీట్ చేశాడు.

ఇప్పుడు ఇద్దరు అగ్నిపర్వతం పైన చేసిన రోప్ వాక్ భయాందోళన కలిగిస్తోంది. చాలా మంది చాలా చూస్తూనే ఉన్నారు. గిన్నిస్ రికార్డ్ ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు.

English summary
rope walk over active volcano by two men. this one guinness record created.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X