వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెలివరీ బాయ్ కుక్క బుద్ధి: సగం నోటితేనే తినేసి.. మళ్లీ ప్యాక్ చేసి..(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

డెలివరీ బాయ్ కుక్క బుద్ధి: సగం నోటితేనే తినేసి.. మళ్లీ ప్యాక్ చేశాడు..!!

బీజింగ్: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు జాగ్రత్తగా తమకు వచ్చిన పార్సిళ్లను పరిశీలించుకునేలా చేశాడు ఈ చైనా డెలీవరీ బాయ్. ఎందుకంటే.. ఇతడు తాను డెలివరీ చేయాల్సిన పార్సిళ్లను సగం తినేసి.. మిగితా సగం ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్లకు ఇచ్చేస్తున్నాడితడు.

సీసీటీవీలో..

సీసీటీవీలో..

చైనా గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని సిహుయి నగరంలో డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం సీసీటీవీలో రికార్డైంది. లిఫ్టులో వెళుతండగా ఆ డెలివరీ బాయ్ ఆహార పదార్థాలు తినడం స్పష్టంగా రికార్డైంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

నోటితోనే తినేశాడు..

నోటితోనే తినేశాడు..

ఆ వీడియోలో ఏముందంటే.. ప్లాస్టిక్ బాక్సును తెరిచిన డెలివరీ బాయ్.. చేతులకు అంటకుండా.. అందులోనే నోరు పెట్టి మరీ తినేశాడు. ఆ తర్వాత చక్కగా మళ్లీ మూత పెట్టేసి కవర్‌లో ప్యాక్ చేసేశాడు.

ఏమీ ఎరుగనట్లుగా ప్యాక్ చేసి..

ఏమీ ఎరుగనట్లుగా ప్యాక్ చేసి..

ఇంకో బాక్సులో ఉన్న సూప్ కూడా అలాగే తెరిచి కొంచెం తాగి మళ్లీ మూత పెట్టి కవర్‌లో పెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా ఎంచక్కా ఆ పార్సిల్‌ను ఆర్డర్ చేసిన వారికి ఇచ్చేందుకు వెళ్లిపోయాడు.

ఉద్యోగం ఊడింది.. జాగ్రత్త అంటూ..

ఆ డెలివరీ బాయ్‌ను చైనాలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ మైచువన్‌కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. అయితే అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ వీడియో వైరల్ అవడంతో సదరు కంపెనీ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. కాగా, ఆ డెలివరీ బాయ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది వీక్షించగా, వేలాదిమంది షేర్లు చేశారు. ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

English summary
While it is true that a good meal can tempt anybody, it is hard to swallow the thought of your food being eaten by somebody else before being served to you. It is even more disturbing to find out that it has been gulped down by nobody else but the delivery man who smilingly handed it to you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X