వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి అద్భుతం: చిన్నారికి రెండు చేతులు మార్పిడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో తొలిసారి, ఓ చిన్న పిల్లవాడికి రెండు చేతులు ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా అమర్చి సర్జన్లు విజయం సాధించారు. జియోన్ హార్వే అనే పిల్లాడికి దాత ఇచ్చిన రెండు చేతులను చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు అమర్చారు.

బాలుడు ఎనిమిదేళ్ల వాడు. అతనికి రెండు చేతులను మార్పిడి ప్రక్రియ ద్వారా అమర్చారు. ఈ శస్త్ర చికిత్స కోసం వైద్యులు పది గంటల పాటు శ్రమించారు. దానిని విజయవంతంగా పూర్తి చేశారు.

Watch This Amazing Child Get a Bilateral Hand Transplant

జియాన్‌ హార్వేకి కొన్నేళ్ల క్రితమే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ కారణంగా రెండు చేతులు, పాదాన్ని తొలగించారు. మూత్రపిండాల మార్పిడి కూడా జరిగింది. జూలై నెలలోనే చిన్నారికి దాత నుంచి సేకరించిన చేతులు, భుజాల్ని అమర్చారు.

40 మందితో కూడిన వైద్యులు, నర్సులు, సిబ్బంది బృందం శ్రమ ఫలించింది. ఏళ్లకొద్దీ శిక్షణ, నెలల కొద్దీ ప్రణాళిక, ఓ బృందం కసరత్తు ఫలితమే ఈ శస్త్రచికిత్స అని ఫిలడెల్ఫియాలోని శిశు వైద్యశాలకు చెందిన స్కాట్‌ లెవిన్‌ పేర్కొన్నారు. బాలుడు త్వరగానే పూర్తిస్థాయిలో కోలుకుంటాడని చెప్పారు.

English summary
Surgeons have successfully performed the first ever bilateral hand transplant on a child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X