వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్కపాతం సమయంలో చంద్రుడిపై ఊరుతున్న నీరు: నాసా

|
Google Oneindia TeluguNews

చంద్రుడి ఉపరితలంపై నీరు ఊరుతోందా..? ఉల్కపాతం సమయంలో చంద్రుడిపై ఎలాంటి చర్యలు చోటుచేసుకుంటున్నాయి..? శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు.. అసలు ఉల్కపాతానికి చంద్రుడిపై నీరు ఊరటానికి సంబంధం ఏమిటి.. దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది... నాసా శాస్త్రవేత్తల ఎలా విశ్లేషిస్తున్నారు..?

చంద్రుడిపై ఊరుతున్న నీరు

చంద్రుడిపై ఉన్న నీరు క్రమంగా బయటకు ఊరుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా మరియు జాన్‌హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన సంయుక్త పరిశోధనల్లో ఈ విషయాన్ని కనుగొన్నారు. చంద్రుడిపై నీరు ఎందుకు బయటకు ఊరుతోందో అనేదానిపై పరిశోధన చేసిన వీరు అంతరిక్షంలో ఉల్కల కారణంగానే చంద్రుడిపై నీరు ఊరుతోందని వెల్లడించారు. ఉల్కపాతం జరిగిన సమయంలో ఆ ఉల్కలు చంద్రుడి పై ఉన్న పొరను బలంగా ఢీకొట్టడంతో ఆ సన్నని పొర చీలి కిందనుంచి నీరు ఊరుతున్నట్లుగా తమ పరిశోధనల ద్వారా బయటపడినట్లు తెలిపారు. కొత్తగా బయటపడిని ఈ విషయం మరిన్ని విషయాలు కనుగొనేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఉల్కల వల్ల చంద్రుడిపై నీరు ఆవిరి రూపంలో బయటకు వస్తున్నట్లు ఇంతకు ముందే గమనించిన శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయారు. అయితే తాజా పరిశీలనలో వారు నీరు ఊరటాన్ని గమనించారు.

 సమాచారం ఇచ్చిన లాడీ రోబో

సమాచారం ఇచ్చిన లాడీ రోబో

లూనార్ అట్మాస్ఫియర్ అండ్ డస్ట్ ఎన్‌విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్ (LADEE లేదా లాడీ)అనే రోబో మిషన్‌ను అంతరిక్షంలోకి పంపిన నాసా దీని ద్వారా పలు ఆసక్తికర విషయాలు కనుగొనింది. లాడీ అనే ఈ రాబోటిక్ మిషన్ చంద్రుడి చుట్టూ పరిభ్రమించి దాని పరిసర ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు చంద్రుడి ఉపరితలంపై ఏదైనా దుమ్ము ధూళి పదార్థాలు ఉన్నాయా అన్నదానిపై కూడా సమాచారం ఇచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడి ఉపరితలం పై ఉల్కలు ఉన్నాయన్న విషయాన్ని లాడీ 2014లో జనవరి 9న, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5, ఏప్రిల్ 9న గుర్తించినట్లు చెప్పారు.

 చంద్రుడిపై ఉల్కలు పడ్డ సమయంలో ఆవిరి రూపంలో నీరు

చంద్రుడిపై ఉల్కలు పడ్డ సమయంలో ఆవిరి రూపంలో నీరు

చంద్రుడిపై నీరు (H2O) మరియు హైడ్రాక్సిల్‌లు ఉన్నట్లు చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.అయితే చంద్రుడిపై నీటి ఆనవాలు ఉన్నాయనే అంశంపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా చంద్రుడి ఉపరితలంపై నీరు పుష్కలంగా ఉన్నాయనేదానికి సరైన ఆధారాలు దొరకలేదని అయితే ఉల్కలు చంద్రుడిపై పడినసమయంలో నీరు ఆవిరి రూపంలో పెద్ద ఎత్తున గుర్తించగలిగామని ఇప్పుడు ఇదే చంద్రుడిపై నీటి ఆనవాలు ఉన్నాయనేదానికి ఊతమిస్తోందని లాడీ ప్రాజెక్ట్ సైంటిస్టు రిచర్డ్ ఎల్‌ఫిక్ వివరించారు. ఇక చంద్రడిపై నీరు ఊరాలంటే ఉల్కలు కనీసం 8 సెంటిమీటర్ల లోపలికి చొచ్చుకు వెళితేనే పొర చీలి నీరు ఆనవాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 ఇదీ లాడీ చరిత్ర

ఇదీ లాడీ చరిత్ర

ఇక ఈ మిషన్‌ను పర్యవేక్షిస్తున్న లూనార్ అట్మాస్ఫియర్ అండ్ డస్ట్ ఎన్‌విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్ (LADEE)అనే ఈ రోబోను నాసాకు చెందిన ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ రూపొందించింది. ఇది కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉంది. ఈ రోబోకు అమర్చిన న్యూట్రల్ మాస్ స్పెక్ట్రోమీటర్ చంద్రుడిపై నీటి ఆవిరి కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. అక్టోబర్ 2013 నుంచి ఏప్రిలో 2014 వరకు ఈ మిషన్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి సమాచారం సేకరించింది.

English summary
NASA scientists have discovered that water is being released from the Moon during meteor showers. Comet debris hit the surface and create a shock wave and for a sufficiently large impactor, this shock wave can breach the soil's dry upper layer and release water from below, NASA said. The newly identified phenomena, observed by NASA's LADEE spacecraft, occurred in 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X