వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: స్విమ్మింగ్ పూల్ లో సునామీ..ఎప్పుడైనా చూశారా? 48 మందికి గాయాలు!

|
Google Oneindia TeluguNews

బీజింగ్: వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. కళ్లముందు చోటు చేసుకున్న ఘటన ఇది. సముద్రాల్లో సునామీ ఏర్పడటాన్ని మనం చూశాం. దాని వల్ల సంభవించే నష్టాన్నీ కళ్లారా చూశాం. సునామీ సందర్భంగా తీర ప్రాంతం ఎలా చివురుటాకులా వణికిపోతుందో మనకు తెలుసు. అలాంటి సునామీ స్విమ్మింగ్ పూల్ లో ఏర్పడితే.. ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. స్విమ్మింగ్ పూల్ లో సునామీ ఏర్పడటం అనేది అసాధ్యమే. అయినప్పటికీ.. అది వాస్తవ రూపం దాల్చింది. సందర్శకులను వణికించింది. వారిని గాయపరిచింది. 10 కాదు 20 కాదు.. ఏకంగా 48 మంది గాయాల పాలయ్యారు ఈ సునామీ వల్ల.

చైనా ఉత్తర ప్రాంతంలోని షుయియున్ వాటర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా చోట్ల ఉన్నట్టుగా ఈ వాటర్ పార్క్ లో కూడా కృత్రిమ అలలను సృష్టించి, సముద్రంలో స్నానం చేస్తున్న భావనను కలిగించే ఏర్పాటు ఉంది. కృత్రిమ అలలను సృష్టించే యంత్రంలో ఉన్నట్టుండి లోపాలు తలెత్తాయి. ఫలితంగా ఆ కృత్రిమ అలలు కాస్తా సునామీలాగా మారిపోయాయి. వాట‌ర్ పార్క్‌లో సరదాగా స్నానం చేయడానికి వచ్చిన సందర్శకులను ఎత్తి కుదేసింది.

Waterpark Wave Machine In China Triggers Tsunami, 48 Injured

వారాంతపు రోజు కావడంతో పలువురు సందర్శకులు తమ కుటుంబంతో సహా షుయియున్ వాటర్ పార్క్ కు చేరుకున్నారు. అక్కడి స్విమ్మింగ్ పూల్ లో తమ పిల్లలతో కలిసి స్నానం చేస్తున్న సందర్భంగా కృత్రిమ అలలు కాస్తా రాకాసి రూపాన్ని దాల్చాయి. పది అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. సందర్శకులు ఒక్కసారి హడలిపోయారు. అలలపై ఆడుకుంటున్నవారు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. సుమారు 48 మందికి పైగా గాయపడ్డారు. కొందర్ని అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించారు. వేవ్ మెషిన్‌లో తలెత్తిన సమస్యల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాటర్ పార్క్ యాజమాన్యం వెల్లడించింది.

English summary
A wave machine at a waterpark in northern China went rogue Sunday, launching a crushing tsunami that injured at least 44 people. Officials at Shuiyun Water Park said that the wave machine malfunctioned, and that the worker operating the machine was not intoxicated, as some media originally reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X