వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం.. కలిసికట్టుగా ఎదుర్కొవాలని మోడీ పిలుపు

|
Google Oneindia TeluguNews

మానవళికి ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీనిని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే మానవళి వినాశనానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఐక్యరాజ్యసమితి 74వ సాధారణ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. వివిధ అంశాలపై భారత వాణిని గట్టిగా వినిపించారు.

ఉగ్రవాదం ఐక్యరాజ్యసమితి విధానాలకు విరుద్ధమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వివిధ అంశాలపై మోడీ 15 నిమిషాలపాటు ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి చేపట్టే శాంతి చర్యలకు భారత్ బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమయంలో ప్రపంచం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కానీ కొన్ని దేశాలు అనుకూలంగా, ప్రతికూలంగా విడిపోవడం బాధాకరమన్నారు. కలిసికట్టుగా ఉంటేనే దేన్నైనా ఎదిరించగలమని పేర్కొన్నారు.

we are face terrorism unitedly : modi

ఉగ్రవాదంపై పోరాడాల్సి అవసరం ప్రతీ ఒక్కరికి ఉందని ప్రధాని మోడీ అన్నారు. అన్నీ దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాాటు పర్యావరణ పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పదే పదే గుర్తుచేశారు. లేదంటే మన భవిష్యత్ తరాలు.. మనల్ని ద్రోహులుగా చూస్తారని అభిప్రాయపడ్డారు. వారికి మంచి భవిష్యత్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు.

English summary
terrorism is the biggest challenge to humanity and hurts the principles of United Nations says Prime Minister Narendra Modi. "India has given the world the message of peace and the country has sacrificed the most in UN's peacekeeping missions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X