వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నాలుగేళ్ల పాలనలో అనేక సంస్కరణలు: యూకే-ఇండియా వీక్‌లో రాజీవ్ కుమార్

|
Google Oneindia TeluguNews

లండన్: భారత ప్రభుత్వం గత నాలుగేళ్లలో అనేక ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కూడా అనేక నూతన మార్పులను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇప్పుడు వ్యవసాయం రంగంపై దృష్టి సారించామని తెలిపారు.

We are on the cusp of major transformation, says Rajiv Kumar

యూకే-ఇండియా వీక్ 2018కి తనను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు రాజీవ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఆయన ఈ సమావేశంలో యూకే హబ్ కల్చర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈడీ లూష్‌తో కలిసి మాట్లాడారు.

భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపేందుకు ఈ నాలుగేళ్లలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టామని రాజీవ్ కుమార్ తెలిపారు. మీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ తరపున తాను పెట్టుబడిదారులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు.

భారత ప్రభుత్వ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతోందని చెప్పారు. ప్రభుత్వంలో ఏమైన తప్పులుంటే చెప్పాలని.. వాటిని సరిచేసుకుంటామని తెలిపారు. పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

వ్యవసాయంపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని అన్నారు. రైతులను మార్కెట్లకు అనుసంధానం చేస్తూ అగ్రి-లైవ్ స్టాక్ మార్కెట్ చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఢిల్లీ కాలుష్యంపై స్పందిస్తూ.. కాలుష్య నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. రెండు టాస్క్ ఫోర్స్ దళాలను ఇందుకోసం ఏర్పాటు చేశామని చెప్పారు. లోకల్ బాడీస్‌లో కాలుష్య నివారణపై చైతన్య కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో గాలి స్వచ్ఛతను పెంచేందుకు ఈ శీతకాలం నుంచి చర్యలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.

యూకే లాంటి దేశాలతో కలిసి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ)పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యల్లో నీటి సమస్య కూడా ఒకటని, దీనిపై ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

English summary
"So many reforms in four years to put India on the trajectory of growth. We are on the cusp of major transformation," says Rajiv Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X