వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమిష్టిగా పోరాడుదాం.. సమస్యలను అధిగమిద్దా: క్వాడ్ దేశాల ప్రతీన

|
Google Oneindia TeluguNews

ఇండో ఫసిఫిక్ దేశాలు సమన్వయంతో కలిసి పనిచేసి కరోనాను పారదోలాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆయా దేశాలు ప్రజాస్వామ్యయుతంగా విలువలతో అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. గ్లోబల్ సెక్యూరిటీ, వాతావరణ మార్పులు, కోవిడ్, టెక్ ఆపరేషన్‌కు సంబంధించి స్నేహితులతో షేర్ చేసుకున్నానని వివరించారు. ఇటు జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగా.. అమెరికా అధినేత జో బైడెన్‌కు థాంక్స్ చెప్పారు. జపాన్ ఆహార పదార్థాలపై గల నిషేధిం ఎత్తివేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సంబంధించి ఏప్రిల్‌లో రిక్వెస్ట్ చేశానని.. గుర్తుచేశారు. ఇదీ మంచి నిర్ణయం అని.. శుభ పరిణామంగా అభివర్ణించారు. నాలుగు దేశాలు కలిసి సమస్యలపై పోరాడేందుకు నిర్ణయం తీసుకున్నాయని జో బైడెన్ తెలియజేశారు. కరోనా, వాతావరణ సమస్యలే కారణం అని తెలియజేశారు.

 We know how to get things done: Joe Biden

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Recommended Video

PM Modi In US 5G - Had Meetings With Qualcomm CEO, Blackstone Group CEO

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

English summary
US President Joe Biden said the four democracies have come together to take on common challenges from Covid to climate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X