వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో విజయం ఖాయం..? నిర్ణయాత్మక విక్టరీ, కమలా హ్యారీస్ ధీమా

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము నిర్ణయాత్మక విజయం సాధిస్తామని డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హ్యారిస్ విశ్వాసంతో ఉన్నారు. తమ పార్టీ విజయం ఖాయమని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ కూడా విజయవాకాశాలపై స్పందించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తామని ఎలా చెబుతారని పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం సిద్దమవుతున్నానని తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరు

నిర్మయాత్మక శక్తిగా..

నిర్మయాత్మక శక్తిగా..

ఉత్తర కరోలినియన్, జార్జియాలో కమలా హ్యరిస్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో నిర్ణయాతక్మంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కన్నా జో బిడెన్ మాత్రం ముందు వరసలో ఉన్నారు. అన్నీ ముందస్తు పోల్స్.. బిడెన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. అయితే 2016లో కూడా హిల్లరీ క్లింటన్ గెలుస్తారని అంచనా వేసినా.. అనూహ్యంగా ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. మరీ 2020లో ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

స్పందన చూశాం...

స్పందన చూశాం...

ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని కమలా హ్యరిస్ తెలిపారు. వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు.. స్పందన చూశామని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పామని.. ప్రతీ రాష్ట్రంలో సాధక బాధకాలను దగ్గరుండి మరీ తెలుసుకున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు ఆటంకాలు లేకుండా.. బెదిరింపులు లేకుండా.. అడ్డంకులు లేకుండా ఓటు వేయడం ముఖ్యం అని భావిస్తున్నానని కమలా హ్యారీస్ తెలిపారు. జార్జియా, నార్తా కరోలినాలో ఆమె ప్రచారం చేసిన సమయంలో కామెంట్ చేశారు. కమలా హ్యరిస్ ర్యాలీలు నల్లజాతి, ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్న చోట ఎక్కువగా సాగుతున్నాయి.

ఇక్కడే ప్రచారం.. ఎందుకంటే..

ఇక్కడే ప్రచారం.. ఎందుకంటే..

కమలా తల్లి ఇండియా సంతతీకి చెందినవారు కాగా.. తండ్రి జమైకన్.. భారత సంతతకి చెందిన నల్లజాతీ మహిళ.. అమెరికా రాజకీయాల్లో అత్యున్నత స్థాయి పదవీకి పోటీలో ఉన్నారు. గతేడాది వరకు కమలా.. అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు. కానీ ప్రజల మద్దతు లేకపోవడంతో రేసు నుంచి తప్పుకున్నారు. బిడెన్ తనతోపాటు పోటీ చేసేందుకు అంగీకరించడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ప్రచారంతో ముందుకెళ్తున్నారు.

English summary
Democratic Vice Presidential nominee Kamala Harris has sought a decisive mandate from Americans so that no amount of legal battle can overturn the poll results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X