వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి..! న‌ర‌మేధం పై న్యూజీలాండ్ వాసుల‌ వేడుకోలు..!!

|
Google Oneindia TeluguNews

క్రైష్టు చ‌ర్చ్/ హైద‌రాబాద్ : అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉండి, ప్రశాంతతకు మారు పేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్‌లోని రెండు మసీదుల్లోకి దుండగులు చొరబడి ప్రార్థనల్లో ఉన్న వారిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేస్తూ భీతిగొల్పేలా ప్రవర్తించారు. ఈ దుర్ఘటనలో 49 మంది మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో జాత్యహంకారి జరిపిన నరమేధం పట్ల న్యూజిలాండ్‌ వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలపై జరిగిన ఈ దాడి హేయమైనదని ఖండిస్తున్నారు. ఇక ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. 'న్యూజిలాండ్‌ చరిత్రలోనే ఇదో చీకటి రోజు' అని ఉద్వేగానికి గురయ్యారు.

మ‌సీదులో ఉన్మాది కాల్పుల‌పై ఆ దేశం క్ష‌మాప‌ణ‌లు కోరింది. స్నేహ సౌబ్రాత్రుత్వాల‌తో విరాజిల్లే న్యూజీలాండ్ దేశంలో ఇలాంటి ఘాతుకం జ‌ర‌గ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. మీరు ధైర్యంగా ఇక్కడ ఉండండి. మమ్మల్ని క్షమించండి. నిజానికి మేము అలాంటి వాళ్లం కాదు. అటువంటి సంకుచిత మనస్తత్వం గల వ్యక్తులు ఎప్పటికీ గెలవలేరు. ప్రేమను ఎంచుకోండి. ప్రశాంతం‍గా జీవించండి' అంటూ న్యూజిలాండ్‌ వాసులు క్రైస్ట్‌చర్చ్‌ మసీదు కాల్పుల బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

ఇండియన్స్ ను తరిమికొట్టాలి : టర్కీ, చైనా, ఇండియా.. శత్రువులు, 74 పేజీల మేనిఫెస్టోలో బ్రెంటాన్ఇండియన్స్ ను తరిమికొట్టాలి : టర్కీ, చైనా, ఇండియా.. శత్రువులు, 74 పేజీల మేనిఫెస్టోలో బ్రెంటాన్

 Were sorry ..! New Zealanders greedings on the massacre .. !!

తమ దేశంలో ముస్లిం సోదరుల పట్ల జరిగిన అమానుష చర్యకు క్షమాపణలు చెబుతున్నారు. ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా సరే తమను సంప్రదించాలంటూ బొటానికల్‌ గార్డెన్‌లో.. పెద్దలు ఫోన్‌ నంబర్లు షేరు చేస్తుండగా.. పిల్లలు తమ బొమ్మలు, పువ్వులు, గ్రీటింగ్‌ కార్డులు అక్కడ ఉంచి శాంతి సందేశం అందిస్తున్నారు.

English summary
New Zealanders are deeply shocked by the massacre in their country. The attack on Muslims is denounced as an attack. The head of the country, General Arden, has condemned the incident. It was embarrassed that 'New Year's Day is the Dark Day'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X