వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ద్వంద్వ నీతి?: యుద్దం బూచితో ఆ దేశం ఏం చేస్తుందో తెలుసా?

ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్దం ముంచుకొస్తే.. ఆ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడే అవకాశం ఉడటంతో.. అమెరికా మిత్ర దేశాలన్ని ఆయుధాల కొనుగోళ్లలో తలమునకలయ్యాయి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియాపై ట్రంప్ హెచ్చరికలతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోతున్నాయని అమెరికా కంపెనీలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు ఆయుధాల కొనుగోళ్లు మాత్రం ఊపందుకున్నాయని ఆ దేశ వర్గాలు చెబుతున్నాయి. ఒకవిధంగా ఈ ప్రయోజనం కోసమే ట్రంప్.. ఉత్తరకొరియాను హెచ్చరించారన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

కిమ్ ధ్వంస రచన?: అమెరికాపై అణుదాడి తప్పదని ఉ.కొరియా సంచలన ప్రకటనకిమ్ ధ్వంస రచన?: అమెరికాపై అణుదాడి తప్పదని ఉ.కొరియా సంచలన ప్రకటన

ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్దం ముంచుకొస్తే.. ఆ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడే అవకాశం ఉడటంతో.. అమెరికా మిత్ర దేశాలన్ని ఆయుధాల కొనుగోళ్లలో తలమునకలయ్యాయి. ఈవిధంగా అమెరికా ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.

weapon sales increased in america after trump warning to north korea

అమెరికా ఆయుధ కంపెనీలకు లాభం చేకూర్చడం కోసమే 'యుద్దానికి సిద్దం' అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారని కొంతమంది పరిశీలకులు చెబుతున్నారు. అదే నిజమైతే.. యుద్దం బూచి చూపి అమెరికా ద్వంద్వ నీతికి పాల్పడుతున్నట్లే. గతంలో సిరియాపై క్షిపణులు దాడి సమయంలోను ఆయుధాల అమ్మకాలు పెరిగాయని కంపెనీలు వెల్లడించాయి.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

అణ్వాయుధాలు ఉన్నాయంటూ గతంలో పలు దేశాలపై దాడి చేసిన అమెరికా.. తన విషయంలో మాత్రం దాన్ని పట్టించుకోకపోవడం ఆ దేశ వైఖరిని బయటపెడుతోంది. ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే.. ఆయుధ విక్రయాల కోసం ద్వంద్వ నీతిని అవలంభించడం అమెరికాకే చెల్లుతోంది.

English summary
Weapon sales hugely increased in America after Donald Trump's warning to North Korea. On the other side stock markets are in huge loss
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X