వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు వధువులు, ఒకే వరుడు: వైరల్‌గా మారిన వెడ్డింగ్ కార్డ్

ఇద్దరు అమ్మాయిలతో ఒకే వ్యక్తి ఒకే రోజు వివాహం చేసుకొంటున్న వివాహ ఆహ్వన పత్రిక ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రెండు కుటుంబాల పెద్దల అనుమతి మేరకే ఇద్దరు అమ్మాయిలను

By Narsimha
|
Google Oneindia TeluguNews

జకార్తా: ఇద్దరు అమ్మాయిలతో ఒకే వ్యక్తి ఒకే రోజు వివాహం చేసుకొంటున్న వివాహ ఆహ్వన పత్రిక ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రెండు కుటుంబాల పెద్దల అనుమతి మేరకే ఇద్దరు అమ్మాయిలను ఆ అబ్బాయి వివాహం చేసుకొన్నాడు. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకొంది.

ఇండోనేషియాలో బహుభార్యత్వం తప్పు కాదు. ఒకసారి ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఈ నిబంధనకు చరమగీతం పాడాడు ఒ యువకుడు. దక్షిణ సుమత్ర దీవుల్లోని తెలుక్‌ కిజింగ్‌ గ్రామానికి చెందిన చింద్ర అనే యువకుడు ఒకే సారి ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అంతేకాకుండా ఆయా కుటుంబాల పెద్దలతో మాట్లాడి వధువులను కూడా వెతుక్కున్నాడు. వారిద్దరి పేర్లనూ జోడిస్తూ ఒకే పెళ్లి శుభలేఖ ముద్రించి బంధువులకు, స్నేహితులకు పంచాడు.

Wedding Invitation Goes Viral Because Groom is Marrying TWO Brides!

ఇప్పటికే ఇద్దరు కంటే ఎక్కువ మంది భార్యలున్న వారు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం రెండో వివాహానికి ముందు కేవలం ఒక భార్య మాత్రమే ఉండాలి. ఇలా ఓకేసారి ఇద్దరిని చేసుకోవడం వారి ఆచారానికి విరుద్ధమంటున్నారు. దీంతో చాలా మంది దీనిని అసత్య ప్రచారంగా పేర్కొన్నారు.

కానీ, స్థానిక వెబ్‌సైట్‌ ఈ పెళ్లి తంతు, శుభలేఖ ముద్రణ యదార్థమేనని వెల్లడించింది. దీనిపై ఈ పెళ్లి ఆచార సంప్రదాయాల ప్రకారమే జరుగుతోందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.

ఇందాహ్‌ లెస్తారిని నవంబర్‌ 5న, పెరావతిని నవంబర్‌ 8న వరుడు చింద్ర వివాహం చేసుకోబోతున్నాడని వివరించారు. రెండు వివాహాల మధ్య గడువు రెండు రోజులే ఉండటం వల్ల వేర్వేరు శుభలేఖలు ముద్రించడం వృథా అనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలిపారు. ఇందాహ్‌ అదే గ్రామానికి చెందిన అమ్మాయికాగా..పెరావతి వేరే కులానికి చెందిన యువతిగా పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాల ఆమోదంతోనే ఈ వివాహం జరుగుతోందని వెల్లడించారు.

English summary
This is definitely something out of the ordinary! Although polygamy is legal in Indonesia, it’s not really common for people to get married to two brides at once. That’s why this wedding invitation recently went viral on social media. A photo of the invitation shows that the groom will marry two women, which caused a flood of outrage among Indonesian netizens.According to Coconuts, people who were supportive of polygamy also condemned the wedding, saying that a Muslim man should learn to live with one wife first before marrying another wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X