వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిలో అందరూ చూస్తుండగా..: కొత్త కోడలికి మామ ముద్దు, తీవ్ర విమర్శలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

పెళ్లిలో అందరూ చూస్తుండగా..: కొత్త కోడలికి మామ ముద్దు, తీవ్ర విమర్శలు(వీడియో)

బీజింగ్: తూర్పు చైనాలో జరిగిన ఓ వివాహా వేడుకలో వధువు పట్ల వరుడి తండ్రి ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. వరుడిని తమ కుటుంబ సభ్యులకు పరిచయం చేసే వంకతో.. ఆమెను దగ్గరికి లాక్కుని ఒక్కసారిగా ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. ఇది తమ ఆచారమని ఆ వరుడి తండ్రి సమర్థించుకుంటుండగా.. కాలం చెల్లిన ఆచారాల పేరుతో కోడలి పట్ల ఇలా ప్రవర్తించడమేంటని అక్కడివారు నిలదీస్తున్నారు.

 బలవంతంగా ముద్దు..

బలవంతంగా ముద్దు..

తూర్పు చైనాలోని జియాంగ్జౌ ప్రావిన్స్‌లో యాంచెంగ్‌లోని వుజౌ అనే ఫంక్షన్‌ హాలులో ఇటీవలే ఓ యువ జంట వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ సందర్భంగా కొత్త కోడలిని బంధువులకు పరిచయం చేసేందుకు ఆమె భుజంపై చేయి వేసి నడిపించుకు వచ్చిన వరుడి తండ్రి.. ఉన్నట్టుండి ఆమె పెదాలపై బలవంతంగా ముద్దుపెట్టాడు.

 వాళ్ల సాంప్రదాయమట..

వాళ్ల సాంప్రదాయమట..

వరుడి తండ్రి వధువుకు బలవంతంగా ముద్దుపెట్టిన వీడియో క్లిప్పింగ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీంతో చాలామంది అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అతని పేరేంటో తెలియరాలేదు కానీ ఇంటిపేరు మాత్రం బియాన్ అని చెబుతున్నారు. దీనిపై బియాన్ తరుపు న్యాయవాదులు కూడా స్పందించారు. తమ సాంప్రదాయంలో వధువుకు వరుడి తండ్రి ముద్దుపెట్టడం ఒక భాగమని వారు చెబుతుండటం గమనార్హం.

ప్రాచీన కాలం నుంచి ఉందట..

ప్రాచీన కాలం నుంచి ఉందట..

ఇలా ముద్దుపెట్టడం యాంచెంగ్‌ సాంప్రదాయంలో భాగమని, ఒక సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే ఇలాంటి తంతు అని బియాన్ తరుపు న్యాయవాదులు అంటున్నారు. ఇలాంటి చర్యల ద్వారా కొత్త కోడలు త్వరగా కొత్త ఇంటి వాతావరణానికి అలవాటుపడుతుందని, ప్రాచీన కాలం నుంచి తాము దీన్ని ఫాలో అవుతున్నామని వారు చెబుతున్నారు.

కాలానికి అనుగుణంగా మారాలంటున్నారు..

ఈ వ్యవహారం లైబ్రరీ డైరెక్టర్, యాంచెంగ్ కల్చర్‌ను స్టడీ చేసిన వాంగ్ డెంగ్జూ అనే వ్యక్తి స్పందించారు. ప్రజలు కాలానికి అనుగుణంగా కొన్ని ఆచార సాంప్రదాయలను వదులుకుంటున్నారని,

అలాగే కొత్తవి అలవరుచుకుంటున్నారని ఆయన చెప్పారు. చెడుగా అనిపించేవాటిని వదిలించుకోవడం, మంచిని దరిచేర్చుకోవడమే ఉత్తమమని అన్నారు.

English summary
Footage posted online of a bridegroom’s father appearing to forcibly kiss his new daughter-in-law at her wedding in eastern China has revived calls for outdated marriage ceremony customs to be abandoned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X