• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసలేంటీ కరోనా వైరస్? లేదంటూనే సర్కారు హెచ్చరికలు.. ఎయిర్ ఇండియా కీలక ఆదేశాలు

|

కంటికి కనపడని కరోనా వైరస్ అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నది.. దీనిపై దక్షిణాసియా దేశాలన్నీ డేంజర్ బెల్స్ మోగించాయి.. ఇండియాలో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.. తాజాగా ఎయిర్ ఇండియా సంస్థ కూడా సీరియస్ ప్రకటన చేసింది. భారత్ లోని వివిధ నగరాల నుంచి దక్షిణాసియా దేశాలకు వచ్చిపోయే విమానాల్లో పైలట్లతోపాటు సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఎన్95 మాస్కులు ధరించాలని ఆదేశించింది. ప్రజలు పానిక్ కాకుడదన్న ఉద్దేశంతోనే కరోనా ఎఫెక్ట్ లేదని ప్రకటనలు చేస్తోన్న ప్రభుత్వాలు.. బాధ్యత మేరకు ఆయా శాఖలకు అవసరమైన హెచ్చరికలూ జారీచేస్తున్నాయి.

అసలేంటి కరోనా వైరస్?

అసలేంటి కరోనా వైరస్?

సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత జలుబు దగ్గర్నుంచి ఎయిడ్స్ దాకా రకరకాల రోగాలకు దారితీసే వైరస్ లను సైంటిస్టులు గుర్తించారు. కానీ నావెల్ కరోనా అనేది కొత్తరకం వైరస్. అలాంటిదొకటి మనిషికి సోకుతుందని ప్రపంచానికి ఇప్పుడే తెలిసింది. నావెల్ కరోనా అనే కుటుంబానికి చెందిన వైరస్ మనిషి శరీంలో ప్రవేశించడం ద్వారా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS-CoV), అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS-CoV) అనే లక్షణాలు ఏర్పడతాయి. దీని వల్ల జలుబు, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి.. చివరికి ఊరిరాడక చనిపోయే ప్రమాదముంది.

మందులు లేవా?

మందులు లేవా?

మనవ శరీరంలో ఇంతకుముందు గుర్తించని కొత్త వైరస్ కావడంతో నావల్ కరోనాకు విరుగుడు మందు కనిపెట్టడం ఆలస్యమవుతోంది. ఈలోపే అది వ్యాప్తి చెందకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఐసోలేషన్ వార్డులు, ఎయిర్ పోర్టుల్లో స్కానర్లతో పరీక్షలు, కరోనా వైరస్ టెస్టుల కోసం ప్రత్యేక ల్యాబ్ లు తదితర ఏర్పాట్లు చేశారు. చైనాలో పాములు, గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందినట్లుగా భావిస్తోన్న ఈ వైరస్ వ్యాప్తిని అరికడుతూనే.. మరోవైపు వైరస్ కు విరుగుడు మందు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

సోకినవాళ్లందరూ చనిపోలేదు..

సోకినవాళ్లందరూ చనిపోలేదు..

కరోనా వైరస్.. గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి సులువుగా వ్యాపిస్తుంది. అందుకే చైనాలో బహిరంగ ప్రదేశాల్లో జన సంచారంపై ఆంక్షలు విధించారు. షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు దాదాపు మూతపడ్డాయి. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా థాయలాండ్, జపాన్, అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలకూ కరోనా వైరస్ వ్యాపించింది. బుధవారం నాటికి అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం కరోనా బారినపడి చైనాలో 131 మందిచనిపోయారు. కానీ ఇతర దేశాల్లో కరోనా మరణాలు చోటుచేసుకున్నట్లు రిపోర్టులేవీ రాలేదు.

English summary
In the wake of the outbreak of coronavirus, Air India (AI) has advised all its cockpit and cabin crew members, who travel to South East Asian cities, to wear N95 masks, an airline spokesperson said on Wednesday. here are details of what is coronavirus, how coronavirus effects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X