వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌పై అభిశంసన ఎందుకు? గట్టెక్కుతారా? గతంలో ఎదుర్కొన్న అధ్యక్షులెవరు?

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్లు స్పీకర్‌కు అభిశంసన తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోబిడెన్‌పై దుష్ప్రచారం చేయాల్సిందిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారన్నది డెమొక్రాట్ల ప్రధాన ఆరోపణ. ఒక్కసారి నిందపడిన తర్వాత తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ట్రంప్‌పై ఉంది. దీంతో స్పీకర్ నాన్సీ పెలోసీ విచారణకు ఆదేశించింది. అయితే ట్రంప్‌ పై ఆరోపణలు రుజువైతే పరిస్థితి ఏంటి..? అసలు అభిశంసన తీర్మానం ఏంటి..? గతంలో అభిశంసన తీర్మానంను ఎవరు ఎదుర్కొన్నారు..?

 ట్రంప్‌పై అభిశంసన నోటీసులు

ట్రంప్‌పై అభిశంసన నోటీసులు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు ట్రంప్‌పై డెమొక్రాట్లు ఇచ్చిన అభిశంసన తీర్మానంకు ముందు విచారణకు ఆదేశించారు స్పీకర్ నాన్సీ పెలోసీ. అయితే అధ్యక్ష పదవిలో ఉన్న ఒక వ్యక్తిపై ఎలాంటి విచారణ చేపట్టరాదని అమెరికా రాజ్యాంగంలో ఉంది. కానీ అభిశంసన తీర్మానం ద్వారా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని తొలగించవచ్చు అనేది కూడా అదే రాజ్యాంగంలో ఉంది.

అభిశంసన తీర్మానం ప్రక్రియ ఏంటి..?

అభిశంసన తీర్మానం ప్రక్రియ ఏంటి..?

ఒక అధ్యక్షుడిని తొలగించే ప్రక్రియలో భాగంగా అభిశంసన తీర్మానంను ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే సభలో సాధారణ మెజార్టీ సరిపోతుంది. దీంతో సెనేట్‌లో విచారణ ప్రారంభం అవుతుంది. విచారణ అనంతరం నివేదిక ఆధారంగా తీర్మానంను ప్రవేశపెడతారు. ఇక్కడ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలంటే మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం అవుతుంది.

ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే పరిస్థితేంటి?

ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే పరిస్థితేంటి?

సెనేట్‌లో అత్యధికులు రిపబ్లికన్‌లే ఉన్నారు. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోవాలంటే రిపబ్లికన్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే తప్ప ఇది జరగదు. ఇది అసాధ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే మెజార్టీ రిపబ్లికన్ సభ్యులు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నవారే. ఒకరిద్దరు సెనేటర్లు ఇప్పటికే ట్రంప్ సర్కార్‌పై వ్యతిరేక గళం విప్పారు. ప్రజల్లో ట్రంప్ గ్రాఫ్ పడిపోతున్నప్పటికీ... హౌజ్‌లో మాత్రం ఆయనకు కావాల్సినంత మద్దతు ఉంది. అందుకే ట్రంప్ అభిశంసన తీర్మానంలో సులభంగా గట్టెక్కుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 1999లో బిల్‌క్లింటన్‌పై అభిశంసన తీర్మానం

1999లో బిల్‌క్లింటన్‌పై అభిశంసన తీర్మానం


ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఇద్దరి అధ్యక్షులు అభిశంసన తీర్మానంను ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్‌స్కీ స్కాండల్‌లో అమెరికా 42వ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానంను ఎదుర్కొన్నారు. తను మోనికా లెవెన్‌స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్‌క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అభిశంసన తీర్మానంకు ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్‌పై విచారణ జరిపాలంటూ కోరారు. 1999లో విచారణ తర్వాత సెనేట్‌లో బిల్ క్లింటన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు. దీంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు.

1867లో ఆండ్రూ జాన్సన్ పై అభిశంసన తీర్మానం

1867లో ఆండ్రూ జాన్సన్ పై అభిశంసన తీర్మానం

ఇక అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న వారిలో ఆదేశ 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ కూడా ఉన్నారు. 1865లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. 1868లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొని ఒక్క ఓటు తేడాతో గట్టెక్కారు. ఒక వ్యక్తిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఆ ఒక్క వ్యక్తి గురించి తాను రాజ్యాంగంను ఉల్లఘించలేనంటూ లోవా సెనేటర్ జేమ్స్ గ్రిమ్స్ చెప్పారు.

English summary
An inquiry has been set up for Trump's impeachment by speaker Nancy peloci. There is a process to impeach a President who is in office. Earlier Bill Clinton and Andrew Johnson faced impeachment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X