వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్: ఏమిటీ అమెరికా బాంబు? ఢిల్లీపై పడితే..!?

ఆప్గనిస్తాన్‌లోని ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబు దాడి వల్ల ఐసిస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని మదర్ ఆప్ ఆల్ బాంబ్స్ అంటారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆప్గనిస్తాన్‌లోని ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబు దాడి వల్ల ఐసిస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని మదర్ ఆప్ ఆల్ బాంబ్స్ అంటారు.

అతిపెద్ద బాంబు: ఐసిస్‌కు పెద్ద దెబ్బ, 'ట్రంప్! పాక్‌లోను దాడి చేయండి'అతిపెద్ద బాంబు: ఐసిస్‌కు పెద్ద దెబ్బ, 'ట్రంప్! పాక్‌లోను దాడి చేయండి'

ఈ బాంబు గురించి..

- ఇది నాన్ న్యూక్లియర్ అతి పెద్ద బాంబు. దీనిని అల్బర్డ్ ఎల్ వీమోర్స్ట్ డెవలప్ చేశారు.
- ఈ బాంబును తొలిసారి 2003లో టెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని ఎగ్లిన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో పరీక్షించారు.
- నాన్ న్యూక్లియర్ బాంబులలోని అతి ప్రమాదకరమైన బాంబు ఇది. కాబట్టి దీనిని మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు.
- ఈ బాంబు ఎక్కడైతే బ్లాస్ట్ అవుతుందో అక్కడి నుంచి 20 మైళ్ల వరకు దాని స్మోక్ కమ్ముకుంటుంది.
- ఇది 21,600 పౌండ్ల బరువు ఉంటుంది. దీని విలువ 16 మిలియన్ డాలర్లు.
- ఇరాక్ ఆర్మీ పైన విజయం సాధించేందుకు తొలిసారి దీనిని తీసుకు వచ్చారు. సద్దాం హుస్సేన్‌ను టార్గెట్ చేసేందుకు డిజైన్ చేశారు.
- సులభంగా వెళ్లలేని గుహలు తదితర ప్రాంతాలలో దాడి చేయడానికి ఉపయోగపడుతుంది.

non-nuclear bomb

ఢిల్లీలో పడితే పరిస్థితి ఏమిటి?

ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద న్యూక్లియేతర బాంబు జీబీయూ43-బీ ఎంవోఏబీని ప్రయోగించింది. దీని దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఆప్గనిస్తాన్‌లో అమెరికా అతిపెద్ద బాంబు దాడి, ఐసిస్ టార్గెట్‌గా పాక్ సరిహద్దుల్లో..ఆప్గనిస్తాన్‌లో అమెరికా అతిపెద్ద బాంబు దాడి, ఐసిస్ టార్గెట్‌గా పాక్ సరిహద్దుల్లో..

16 మిలియన్ల డాలర్ల నిర్మాణ వ్యయం, 21,600 పౌండ్లు కలిగిన ఈ బాంబు గాల్లోనే పేలిస్తే దాని రేడియేషన్ ప్రభావం 44 మమీటర్లు ఉంటుందని, ఇక థర్మల ్రేడియేషన్ గమనిస్తే 110 మీటర్ల వరకు భస్మం చేసే శక్తి ఉంటుందని అమెరికా న్యూక్లియర్, న్యూక్లియేతర బాంబుల విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ బాంబు కనుక ఢిల్లీలోని సెంట్రల్ పార్క్, కనౌట్ ప్రాంతంలో పడినట్లుగా భావిస్తే.. ఆ సమయంలో దాడి ప్రాంతానికి 300 మీటర్ల దూరం గానీ 4 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్‌లో గానీ ఉండి ఉంటే ప్రాణాలతో ప్రాణాలతో బయటపడవచ్చట. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న జనాభా దృష్ట్యా దీని తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందంటున్నారు. రెండువేలకు పైగా మృత్యువాత పడతారని అంటున్నారు.

English summary
On Thursday, the United States dropped the most powerful non-nuclear bomb on Afghanistan to target a cave used by Islamic State militants. The GBU-43 or the Massive Ordinance Air Blast also known as the Mother of all Bombs targetted an IS hideout in the Nangarhar province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X