వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీ-20 సదస్సు అంటే ఏంటీ ? అధినేతలు ఏయే అంశాలపై చర్చిస్తారు ..!

|
Google Oneindia TeluguNews

ఒసాకా : జపాన్‌లోని ఒసాకా నగరంలో జీ-20 సదస్సు జరుగుతుంది. సభ్యదేశాలు పాల్గొని .. తమ సమస్యలు, అభివృద్ధి ఇతర అంశాలను సదస్సు దృష్టికి తీసుకొస్తున్నాయి. ఇంతవరకు ఓకే .. అసలు జీ-20 సదస్సు అంటే ఏంటీ ? ఇందులో సభ్యుదేశాలు ఏవీ ? సదస్సులో అధినేతలు ఏం చర్చిస్తారు ? అనే సందేహాలు మీ మెదడును తొలుస్తున్నాయా ? అయితే ఈ స్టోరీ చదవండి.

ఇండియా గౌరవాన్ని దెబ్బతీశాడు : ట్రంప్‌తో సమావేశం కావొద్దు .. మోడీకి సీతారం ఏచూరి డిమాండ్ ఇండియా గౌరవాన్ని దెబ్బతీశాడు : ట్రంప్‌తో సమావేశం కావొద్దు .. మోడీకి సీతారం ఏచూరి డిమాండ్

జీ-20 అంటే ?

జీ-20 అంటే ?

ఓ దేశం వేగంగా అభివృద్ధి చెందడమే. ఆయా దేశాల అభివృద్ధి ప్రపంచ జీడీపీలో 85 శాతం ఉంటుంది. దీంతోపాటు జనాభా కూడా రెండింట మూడోంతులు కలిగి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అధికార విభాగం ఉండదు. వచ్చే ఏడాది నిర్వహించబోయే దేశమే ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది డిసెంబర్‌లో వచ్చే సమావేశం నిర్వహించే జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. అయితే జీ 20లో ఇరవై సభ్య దేశాలు ఉన్నాయి. సమావేశానికి అతిథిగా దేశాలు కూడా హాజరవచ్చు. స్పెయిన్ ప్రతీసారి గెస్ట్‌గా సమావేశానికి తమ ప్రతినిధిని పంపుతుంది.

అంకురార్పణ ఇలా ...

అంకురార్పణ ఇలా ...

1999లో బెర్లిన్‌లో తొలి జీ-20 సదస్సు జరిగింది. ఆ సమయంలో తూర్పు ఆసియా ఆర్థిక లోటుతో సతమతమైంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. 2008లో మొదటి సమావేశం జరిగింది. తర్వాత ఏడాదికోసారి భేటీ అవుతుంది. బెర్లిన్‌లో జరిగిన తొలి సమావేశానికి ఆయా దేశాల ఆర్థికమంత్రులు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు హాజరయ్యారు. అయితే 2008లో ఆర్థికమాంద్యం రావడంతో జీ-20 సదస్సుకు ఆయా దేశాల అధ్యక్షులు హాజరవుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిని, నిరుద్యోగం పెరగడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై నిర్ణయం తీసుకొనేది అధినేతలే కాబట్టి .. దాంతో అధినేతలు సమావేశమవుతున్నారు.

ఆర్థికమే మూలం ..

ఆర్థికమే మూలం ..

జీ-20 సదస్సులో ఆయా దేశాల అధినేతలు ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తారు. తమ తమ వ్యుహలను సభ్యదేశాల అధినేతలతో పంచుకుంటారు. వాణిజ్యం, వాతావరణ మార్పులపై ఈసారి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ట్రంప్, జిని పింగ్, ట్రంప్, మోడీ మధ్యయ పన్నులు తదితర అంశాలపై కీలక డిస్కషన్స్ జరుగనున్నాయి. ఇంగ్లాండ్ ప్రధానిగా రాజీనామా చేసిన థెరెసా మే కూడా సమావేశానికి హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆమె వివిధ అంశాలపై కూలంకషంగా మాట్లాడతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కీలకంగా ప్రస్తావన ఉంటుంది. సదస్సులో వివిధ అంశాలపై ఒప్పందం చేసుకొని .. తర్వాత అధినేతలు ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు వివిధ అంశాలపై చర్చలకు సంబంధించి సాక్షిభూతంగా నిలుస్తాయి. గతేడాది కొందరు అధినేతలు సౌదీ రాజుతో కరచాలనం చేసిన సంగతి తెలిసిందే.

 170 దేశాలకు లేని ఆహ్వానం ..

170 దేశాలకు లేని ఆహ్వానం ..

జీ-20 సదస్సులో కొందరు నేతలు మాత్రమే అధిపత్యం చెలాయిస్తున్నారు. మిగతా దేశాల ప్రాతినిధ్యం తక్కువేననే అభిప్రాయం ఉంది. చిన్నదేశాలు తమ సమస్యలను కూడా సరిగా చెప్పలేని పరిస్థితి. అంతేకాదు దాదాపు 170కి పైగా దేశాలను అతిథిగా కూడా పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇందులో ఓటింగ్ ప్రక్రియ కూడా ఉండదు. సమావేశాలు, ఒప్పందాలు కూడా అంతా న్యాయబద్దంగా జరగవని తెలుస్తోంది.

English summary
The group has no permanent staff of its own, so every year in December, a G20 country from a rotating region takes on the presidency. That country is then responsible for organising the next summit, as well as smaller meetings for the coming year. They can also choose to invite non-member countries along as guests. Spain is always invited. The first G20 meeting took place in Berlin in 1999, after a financial crisis in East Asia affected many countries around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X