వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా పిల్లల తండ్రి ప్రధాని: ఇమ్రాన్‌పై జెమీమా, భారత్‌పై మాజీ క్రికెటర్ విషం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచీ: 22 ఏళ్ల పాటు ఇమ్రాన్ ఖాన్ ఎన్నో కష్టాలు పడ్డారని జెమీమా అన్నారు. పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో పీటీఐ గెలిచిన నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. నా పిల్లల తండ్రి పాకిస్తాన్ ప్రధాని అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇమ్రాన్ ఖాన్ పట్టుదల గల మనిషి అన్నారు.

జెమీమా ఖాన్ బ్రిటన్‌కు చెందిన వ్యక్తి. ఆమె స్పందిస్తూ.. 1997లో ఇమ్రాన్ ఖాన్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన రోజులు తనకు ఇంకా గుర్తుకు ఉన్నాయని, అప్పట్లో ఫలితాల కోసం తాను ఎంతో ఆతృతతో వేచి చూశానని, అప్పుడు వేచి చూస్తున్న ఫోన్ వచ్చిందని, మొత్తం ఊడ్చేశాం... మరో రకంగా అని పగలబడి నవ్వారని గుర్తు చేసుకున్నారు.

నా బిడ్డల తండ్రి ప్రధాని కాబోతున్నాడు

అడ్డంకులను ఎదుర్కొని, త్యాగాలు చేసిన నా బిడ్డల తండ్రి ఈ రోజు పాకిస్తాన్ ప్రధాని కాబోతున్నారని జెమీమా పేర్కొన్నారు. ఇదో తిరుగులేని పాఠం అన్నారు. తాను రాజకీయాల్లో ఎందుకు ప్రవేశించింది గుర్తుంచుకోవడమే ఇప్పుడొక సవాల్ అని, ఇమ్రాన్‌కు అభినందనలు అని ఆమె పేర్కొన్నారు. జెమీమాను 1995లో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. 2005లో విడాకులిచ్చాడు. అప్పటి నుంచి ఆమె లాహోర్‌ను విడిచి లండన్‌లో ఉంటున్నారు.

ఇమ్రాన్‌కు మాజీ భార్య రెహామ్ ఓటు వేయలేదా?

ఇమ్రాన్‌ఖాన్‌కు మాజీ భార్య రెహమ్ ఖాన్‌ ఓటు వేయలేదా? ఆమె తన ఓటును మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ఎన్‌కు వేసిందా.. అంటే అవుననే అంటున్నారు. ట్విట్టర్ అకౌంటులో ఆమె పెట్టిన పోస్టును బట్టి ఇది తేలిపోయిందని చెబుతున్నారు. ఓటు వేసిన అనంతరం రోడ్డుపై చిన్న పులి బొమ్మ పడేలా సెల్ఫీ దిగింది. 'నేను పులికి ఓటు వేశాను' అని పేర్కొంది. పీఎంఎల్‌ఎన్ పార్టీ గుర్తుపై పులి ఉంటుంది. అంతేకాకుండా, ఇమ్రాన్ గెలవడంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. బీబీసీ రిపోర్టర్‌గా పాకిస్తాన్‌లో పని చేసిన రెహామ్ ఖాన్ 2015లో ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది చివర్లో విడాకులు తీసుకున్నారు.

 బీబీసీ క్షమాపణ

బీబీసీ క్షమాపణ

పాకిస్థాన్‌ ఎన్నికల కవరేజిలో బీబీసీ ప్రసారం చేసిన ఓ కార్యక్రమంలో ఇమ్రాన్‌ఖాన్‌కు బదులు పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ ఫుటేజీని చూపించారు. పొరపాటును గ్రహించిన తర్వాత క్షమాపణలు చెప్పారు. పాకిస్తాన్ ఎన్నికల్లో క్రికెట్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్‌ ఆధిపత్యంలో కొనసాగుతున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే.

భారత్ అడుగేస్తే, మేం రెండు: కాబోయే పాక్ ప్రధాని ఇమ్రాన్, భారత్ మీడియా, కాశ్మీర్‌పై కీలకవ్యాఖ్యలు భారత్ అడుగేస్తే, మేం రెండు: కాబోయే పాక్ ప్రధాని ఇమ్రాన్, భారత్ మీడియా, కాశ్మీర్‌పై కీలకవ్యాఖ్యలు

భారత్‌తో మంచి సంబంధాలు అంటూ విషం

భారత్‌తో మంచి సంబంధాలు అంటూ విషం


ఇదిలా ఉండగా, భారత్‌తో స్నేహ సంబంధాలు అంటూనే ఇమ్రాన్ ఖాన్ విషం చిమ్మాడు. భార్ మీడియా తనను విలన్‌లా చిత్రీకరించిందని, తాను కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, ఈ కారణంగా తనను ఆ దేశ మీడియా బాలీవుడ్‌ విలన్‌‌లా చూపుతోందని ఆరోపించారు. భారత్ సహా పొరుగుదేశాలతో సత్సంబంధాలు అవసరమంటూ కాశ్మీర్ అంశం అడ్డుగా ఉందన్నారు. భారత్ కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. కాశ్మీరీలు వేదన అనుభవిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా పాకిస్తాన్‌ను నిందించడం భారత్‌కు అలవాటుగా మారిందన్నారు. ఇండియా - పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ అంశం కారణంగానే మనస్పర్థలు ఏర్పడ్డాయని, కానీ ఆ ప్రభావం క్రీడలపై పడుతోందన్నారు. ఒక క్రికెటర్‌గా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పరచడం తన బాధ్యత అన్నారు.

English summary
22 years later, after humiliations, hurdles and sacrifices, my sons’ father is Pakistan’s next PM. It’s an incredible lesson in tenacity, belief & refusal to accept defeat. The challenge now is to remember why he entered politics in the 1st place. Congratulations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X