వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్‌ డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ ఫీచర్‌లో మార్పులు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్ గతేడాది కొత్త ఫీచర్‌ "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ఒక వేళ ఏదైనా మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపించినట్లయితే వెంటనే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది కూడా మెసేజ్ పంపిన కొంత సమయంలోపే డిలీట్ చేయాల్సి ఉంది. తాజాగా ఈ ఫీచర్‌లో మరో మార్పు తీసుకురానుంది.

ఒక వేళ మనం మెసేజ్ పంపిన తర్వాత అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ వినియోగించి మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించింది.

Whatsapp decides to bring in changes in its feature Delete for everyone

ఒకవేళ ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక మెసేజ్‌ను పంపినట్లయితే రెండో వ్యక్తి చూసుకోకుండా మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం కానీ... ఇంటర్నెట్ తొలగించడం కానీ చేస్తే ఆ సమయంలో ఈ ఫీచర్ పనిచేస్తుందా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఒక మెసేజ్ పంపిస్తే... అది అవతల వ్యక్తికి చేరుతుంది.కానీ వెంటనే మొబైల్ డేటా తొలగిస్తే పంపిన ఆ మెసేజ్ మాత్రం డివైస్‌లోనే ఉంటుంది. మెసేజ్ పంపిన వ్యక్తి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ వినియోగించి డిలీట్ చేస్తే... రెండో వ్యక్తి మాత్రం ఎప్పుడైతే ఇంటర్నెట్ లేదా మొబైల్ డేటా ఆన్ చేస్తాడో అప్పుడే అది తొలగిపోతుంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

English summary
WhatsApp last year launched the most sought after feature, “delete for everyone.” As the name implies, the feature enables users to revoke messages in case they were sent to a wrong contact or group. WhatsApp is now making an important change to the feature which is aimed at users who bypassed the time limit on revoking messages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X