వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైండ్ బ్లాక్ అవుతుంది: వాట్సాప్ యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..కొత్తగా రాబోతున్న ఫీచర్స్ ఇవే..!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్స్‌కు సంబంధించిన సమాచారం పొందుపర్చింది. రెండేళ్ల క్రితం 1.5 బిలియన్‌ యూజర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2 బిలియన్‌కు చేరిందని వాట్సాప్ యాజమాన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. ఇక దీనిపై యాడ్స్‌ కూడా ఉచితమే అని వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని పేర్కొంది.

జిందగీ నా మిలేగీ : ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా భారత రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టుజిందగీ నా మిలేగీ : ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా భారత రహస్యాలను పాక్‌కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టు

 2 బిలియన్ యూజర్లతో రెండో స్థానంలో వాట్సాప్

2 బిలియన్ యూజర్లతో రెండో స్థానంలో వాట్సాప్

ఫేస్‌బుక్ అనేక సంస్థలకు మాతృసంస్థగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మాతృసంస్థ నుంచి 2 బిలియన్ యూజర్లు రావడంలో వాట్సాప్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఫేస్‌బుక్ యాప్‌కు 2.5 బిలియన్ యూజర్లు ఉన్నారు. జనవరిలో విడుదలైన నివేదిక ప్రకారం ఫేస్‌బుక్, మెసెంజర్ , ఇన్స్‌టాగ్రామ్, వాట్సాప్‌లను రోజూ ఓపెన్ చేసే వారి సంఖ్య 2.6 బిలియన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గత త్రైమాసికంలో 2.2 బిలియన్‌గా ఉన్నింది. ప్రతి నెలా 2.89 బిలియన్ యూజర్లు ఫేస్‌బుక్‌ కుటుంబాన్ని వీక్షిస్తున్నారు.

వాట్సాప్ ప్రస్థానం

వాట్సాప్ ప్రస్థానం

వాట్సాప్‌ 11 ఏళ్ల క్రితం ఆవిర్భవించింది. ఆరేళ్ల క్రితం దీన్ని 19 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేసింది. ప్రపంచంలో ఏ మూలకైనా సరే కనెక్ట్ అయ్యేలా ఫేస్‌బుక్ సంస్థ వాట్సాప్‌ను రీడిజైన్ చేసింది. వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కకుండా అత్యంత భ్రదత ఉండేలా ఈ యాప్‌ను డిజైన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వాట్సాప్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు కూడా తమదైన శైలిలో మెసేజింగ్ యాప్‌ను రూపొందించే పనిలో పడ్డాయి.

వాట్సాప్ భద్రత ఎలాంటిందంటే..

వాట్సాప్ భద్రత ఎలాంటిందంటే..

వాట్సాప్‌కు ఎలాంటి భద్రత ఉందంటే ఇందులో డిజిటల్ లాక్ వ్యవస్థ ఉంది. దీంతో యూజర్‌కు వచ్చే మెసేజ్‌లు కానీ, యూజర్ పంపే మెసేజ్‌లు కానీ చాలా భద్రంగా ఉంటాయి. అంతేకాదు హ్యాకర్స్ నుంచి ఇతర క్రిమినల్స్ నుంచి సేఫ్‌గా ఉండేందుకు వాట్సాప్ ఫీచర్‌లో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మెసేజ్‌లు మొత్తం అత్యంత భద్రతతో ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంటాయని యూజర్ అనుమతి లేకుండా మరొకరు చదివేందుకు ఆస్కారం ఉండదని, అదే సమయంలో తాము రూపొందించిన యాప్ అయినప్పటికీ వారు కూడా చదవలేరని భరోసా ఇస్తూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది వాట్సాప్.

బిజినెస్ టూల్స్ ద్వారా మంచి మార్కెట్

బిజినెస్ టూల్స్ ద్వారా మంచి మార్కెట్

వాట్సాప్ రెండు బిలియన్ యూజర్లను దక్కించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు వాట్సాప్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్. ముఖ్యంగా వాట్సాప్‌కు భారత్‌లో మంచి మార్కెట్ ఉందని భారత్‌లో ఉన్న యూజర్లు మరేదేశంలో వాట్సాప్‌కు లేరని ఆయన అన్నారు. భారత్ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని వాట్సాప్‌కున్న ఆదరణ మరే యాప్‌కు లేదని చెప్పారు. వాట్సాప్‌ బిజినెస్ టూల్స్‌ను కూడా కొత్తగా రూపొందించింది. దీని ద్వారా ఆన్‌లైన్‌లోనే ఆయా వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో కనెక్ట్ అయ్యే వేదికను క్రియేట్ చేసింది.

వాట్సాప్ భద్రతపై దృష్టి సారించాం

వాట్సాప్ భద్రతపై దృష్టి సారించాం

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డిజి ప్రెక్స్ అనే ఫార్మా స్టార్టప్ సంస్థ వాట్సాప్ వేదికగా తమ వ్యాపారంను నడుపుతోంది. కస్టమర్లకు కావాల్సిన మెడిసిన్స్ ఆర్డర్ తీసుకుని వారికి డెలివర్ చేస్తోంది. వాట్సాప్ ద్వారా పేషెంట్లు తమ ప్రిస్క్రిప్షన్‌ను షేర్ చేయగానే డిజిప్రెక్స్ నుంచి డెలివరీ సిబ్బంది వారికి కావాల్సిన మెడిసెన్స్‌ను ఇంటివద్దకు డెలివర్ చేస్తోంది. వాట్సాప్ ఎంతైతే మంచికి ఉపయోగపడుతోందో అంతే అవాస్తవమైన వార్తలు వేగంగా వెళ్లేందుకు వేదికగా నిలుస్తోంది. దీనిపై తాము దృష్టి సారించామని త్వరలోనే చెక్ పెడతామని విల్ క్యాత్ కార్ట్ చెప్పారు.

English summary
WhatsApp, the most popular messaging app, revealed today just how big it has become. The Facebook -owned app said it has amassed two billion users, up from 1.5 billion it revealed two years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X